Telugu Global
Andhra Pradesh

సీబీఐ స్పీడ్.. అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమేనా..?

వివేకా హత్యకేసు విచారణ అధికారి మారిన తర్వాత సీబీఐ ఈ కేసులో స్పీడ్ పెంచింది. వెంట వెంటనే ఇద్దరు అరెస్ట్ కావడం, ఆ ఇద్దరూ వైసీపీతో సంబంధం ఉన్నవారే కావడంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సీబీఐ స్పీడ్.. అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమేనా..?
X

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకు ముందు అవినాష్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక ఈ కేసులో నెక్స్ట్ పెద్ద వికెట్ ఎవరిది..? అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమేనా..? ఇప్పటికే ఆయన్ను నాలుగుసార్లు సీబీఐ విచారణకు పిలిపించింది. తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా నిరోధించేలా గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వివేకా హత్యకేసులో నెక్ట్స్ అరెస్ట్ ఎవరిది అనేది ఆసక్తిగా మారింది.

ఆమధ్య సీఎం జగన్ రెండుసార్లు హడావిడిగా ఢిల్లీ వెళ్లి వచ్చారు. రాష్ట్రంకోసం జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతుండగా.. సీబీఐ కేసు వ్యవహారంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి వచ్చారని టీడీపీ ఆరోపించింది. జగన్ ఢిల్లీ పర్యటన సంగతి పక్కనపెడితే.. వివేకా హత్యకేసు విచారణ అధికారిని మార్చడం మాత్రం సంచలనంగా మారింది. ఆ అధికారి మారిన తర్వాత సీబీఐ ఈ కేసులో స్పీడ్ పెంచింది. వెంట వెంటనే ఇద్దరు అరెస్ట్ కావడం, ఆ ఇద్దరూ వైసీపీతో సంబంధం ఉన్నవారే కావడంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమేనా..?

తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ అవినాష్ రెడ్డి గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన అరెస్ట్ పై తీవ్ర ఊహాగానాలు వినిపించాయి. సీబీఐ విచారణ అధికారి మారడంతో ఈ కేసులో ఏదో జరుగుతోందనే పుకార్లు కూడా వ్యాపించాయి. ఈ పుకార్లను టీడీపీ బాగా సర్కులేట్ చేసింది. నిజంగానే జగన్ ఢిల్లీకి వెళ్లి సీబీఐ విషయంలో కేంద్రంతో చర్చలు జరిపి వచ్చి ఉంటే.. ఇప్పుడీ అరెస్ట్ లు ఉండేవి కావు కదా. ఒకవేళ నిజంగానే ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం రాజకీయంగా అది వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.

First Published:  16 April 2023 5:42 AM GMT
Next Story