25వేల కిలోల డ్రగ్స్ సీజ్.. ఉలిక్కిపడిన విశాఖ
జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న ఓ కంటెయినర్ వైజాగ్ పోర్ట్‌కు వచ్చింది. ఓ ప్రైవేట్ కంపెనీ ఇందులో 1000 బ్యాగుల్లో ఒక్కోదానిలో 25 కిలోల డ్రగ్స్ నింపి ఈ కంటెయినర్‌లో పంపింది.
BY Telugu Global21 March 2024 9:42 PM IST
X
Telugu Global Updated On: 21 March 2024 10:12 PM IST
ఒకటీ రెండూ కాదు.. వందా, రెండు వందలూ కాదు.. ఏకంగా 25వేల కిలోల డ్రగ్స్ బయటపడటం విశాఖ తీరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. బ్రెజిల్ నుంచి వైజాగ్ వచ్చిన ఓ కంటెయినర్‌లో ఏకంగా 25 టన్నుల డ్రగ్స్ ఉన్నాయని ఇంటర్‌పోల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగి డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది.
పట్టుకోవడానికి ఆపరేషన్ గరుడ
జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న ఓ కంటెయినర్ వైజాగ్ పోర్ట్‌కు వచ్చింది. ఓ ప్రైవేట్ కంపెనీ ఇందులో 1000 బ్యాగుల్లో ఒక్కోదానిలో 25 కిలోల డ్రగ్స్ నింపి ఈ కంటెయినర్‌లో పంపింది. విశాఖలోని ఓ ఆక్వా ఎక్స్‌పోర్ట్ కంపెనీ పేరుతో ఈ సరకు వచ్చింది. ఈ డ్రగ్స్‌ను పట్టుకోవడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ రంగంలోకి దిగింది. కస్టమ్స్ అధికారులతో కలిసి వీటిని స్వాధీనం చేసుకుంది.
Next Story