17న లండన్‌కు జగన్
కుటుంబ సమేతంగా జగన్ లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్తారని తెలుస్తోంది. అక్కడే దాదాపు 14 రోజుల పాటు గడపనున్నారు జగన్.

నిన్నటి వరకు ఎన్నికల ప్రచారం, రోడ్ షోలతో బిజీగా గడిపారు జగన్. తాజాగా ఎన్నికలు ముగియడంతో ఆయనకు కాస్త విరామం దొరికింది. విరామ సమయంలో ఫ్యామిలీతో గడిపేందుకు ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. తాజాగా జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాల్లో పర్యటించనున్నారు జగన్. కుటుంబ సమేతంగా జగన్ లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్తారని తెలుస్తోంది. అక్కడే దాదాపు 14 రోజుల పాటు గడపనున్నారు జగన్. ఎన్నికల కౌంటింగ్‌కు 3 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి రానున్నారు.
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. అయితే ఇరువైపులా వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు పర్మిషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ నంబర్, మెయిల్ ID కోర్టుకు, CBIకి సమర్పించాలని జగన్‌ను ఆదేశించింది.