పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు
మరోపక్క పవన్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై విజయవాడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం స్థానిక వలంటీర్ దిగమంటి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సురేష్ ఫిర్యాదు చేశారు.
వలంటీర్ల వ్యవస్థపై అసత్య ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్.. సమాజంలో తమను తలెత్తుకోకుండా చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐపీసీ 153, 153ఏ, 505(2) సెక్షన్ల కింద పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు, పలువురు వలంటీర్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ సత్తిబాబుకు ఫిర్యాదు చేశారు. మరోపక్క పవన్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.