అల్లు అర్జున్‌పై కేసు..ఎందుకంటే.!
అల్లు అర్జున్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం, అభిమానులు తరలివచ్చారు. ఏపీలో ఎలక్షన్ కోడ్, 31 యాక్ట్ అమలులో ఉండగా.. అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారన్న రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు నంద్యాల పోలీసులు.
BY Telugu Global11 May 2024 9:30 PM IST
X
Telugu Global Updated On: 11 May 2024 9:30 PM IST
అల్లు అర్జున్‌కు షాకిచ్చారు ఏపీ ఎన్నికల అధికారులు. అల్లు అర్జున్‌తో పాటు నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి IPC సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా.. అల్లు అర్జున్ ఇవాళ నంద్యాలకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం, అభిమానులు తరలివచ్చారు. ఏపీలో ఎలక్షన్ కోడ్, 31 యాక్ట్ అమలులో ఉండగా.. అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారన్న రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు నంద్యాల పోలీసులు.
Next Story