పేదల ‘పట్టాల’పై మళ్ళీ కేసా?
రాజధాని కోసం ప్రభుత్వం సమీకరించిన 1251 ఎకరాల్లోనే సుమారు 100 ఎకరాలను ప్రభుత్వం పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. దాన్నే అమరావతి ప్రాంతం వాళ్ళు అడ్డుకుంటున్నారు. రాజధాని నిర్మాణమంటేనే తాము భూములు ఇచ్చాంకానీ పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి కాదని వాదిస్తున్నారు.
పేదలకు తమ ప్రాంతంలో ఇళ్ళ పట్టాలు ఇవ్వకూడదనే అభ్యంతరంతో ఆవల నందకిషోర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేశారు. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన కిషోర్ ప్రభుత్వ నిర్ణయాన్ని చాలెంజ్ చేశారు. గతంలో కూడా ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అనుకున్నపుడు కూడా కొందరు రైతులు కోర్టులో కేసులు వేయటంతో పట్టాల పంపిణీ నిలిచిపోయింది. పేదలకు తమ ప్రాంతంలో ఇళ్ళ పట్టాలు ఇవ్వటం వల్ల డెమొక్రటిక్ ఇంబాలెన్స్ తప్పిపోతుందని అప్పట్లో వాదించారు.
మళ్ళీ తాజా కేసులో కూడా దాదాపు ఇలాంటి వాదననే తెరపైకి తెచ్చారు. అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చి తాజాగా ఆర్-5 జోన్ అని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధాని కోసం ప్రభుత్వం సమీకరించిన 1251 ఎకరాల్లోనే సుమారు 100 ఎకరాలను ప్రభుత్వం పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. దాన్నే అమరావతి ప్రాంతం వాళ్ళు అడ్డుకుంటున్నారు. రాజధాని నిర్మాణమంటేనే తాము భూములు ఇచ్చాంకానీ పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి కాదని వాదిస్తున్నారు.
అంటే వీళ్ళ వాదనలో స్పష్టంగా కనబడుతున్నదేమంటే పేదలకు తమ ప్రాంతంలో చోటులేదని. దీన్నే ప్రభుత్వం తప్పుపడుతోంది. అన్నీవర్గాల ప్రజలకు రాజధాని ప్రాంతంలో బతికే అవకాశముండాలన్నది ప్రభుత్వం వాదన. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అని నిర్ణయించిన తర్వాత అమరావతి ప్రాంతానికి దాదాపు ప్రాధాన్యత తగ్గిపోయినట్లే. ఒకసారి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసును వైజాగ్ తరలించుకుపోతే ఇక అమరావతిని ఎవరూ పట్టించుకోరు.
ఇంతోటిదానికి రైతులు ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారో అర్థంకావటంలేదు. తమ భూములను పేదలకు ఇళ్ళ పట్టాలుగా ఇవ్వకూడదని రైతులు వాదించటమే వాళ్ళకి మైనస్ అవుతోంది. కోర్టులో కేసు ఎలాగున్నా జనాల్లో మాత్రం వాళ్ళ వాదనపై బాగా వ్యతిరేకత కనబడుతోంది. ఒకసారి భూములను ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత ఇక ఆ భూములపై రైతులకు ఎలాంటి హక్కులుండవని ప్రభుత్వం వాదిస్తోంది. మొత్తానికి పేదలకు పట్టాల పంపిణీ వివాదం ఇప్పట్లో తెగేట్లుగా కనబడటంలేదు. 2024 ఎన్నికలైనా ఈ వివాదానికి పరిష్కారం చూపుతుందేమో చూడాలి.