Telugu Global
Andhra Pradesh

ఊహించిందే.. ద్వారంపూడిపై కేసు

ద్వారంపూడి త‌మ‌తో గొడవకు దిగారని, రెచ్చగొట్టేలా వ్యాఖ్య‌లు చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయ‌న‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఊహించిందే.. ద్వారంపూడిపై కేసు
X

అంద‌రూ ఊహించిందే జరిగింది. కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. కాకినాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ద్వారంపూడి, ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు 24 మందిపై కేసు నమోదైంది.

ఈనెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని సూరిబాబుకు చెందిన బిల్డింగ్‌ను అక్రమ కట్టడం అంటూ కూల్చివేసే ప్రయత్నం చేశారు మున్సిపల్ అధికారులు. కూల్చివేతలను అడ్డుకునేందుకు అనుచరులతో అక్కడికి వెళ్లారు ద్వారంపూడి. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎమ్మెల్యేపై మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. ద్వారంపూడి త‌మ‌తో గొడవకు దిగారని, రెచ్చగొట్టేలా వ్యాఖ్య‌లు చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయ‌న‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో A1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, A2గా బళ్ల సూరిబాబును చేర్చారు.

ఎన్నికలకు ముందు నుంచే ద్వారంపూడిని టార్గెట్ చేశారు కూటమి నేతలు. ప్రధానంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పదేపదే ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం ద్వారంపూడిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ద్వారంపూడిపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, సుధాకర్‌ వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు.

First Published:  5 July 2024 5:04 AM GMT
Next Story