Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు మీద భారం పెరిగిపోవడం ఖాయమా..?

పొత్తనేది కేవలం జనసేనతో మాత్రమే ఉంటుందా లేకపోతే వామపక్షాలతో కూడా ఉంటుందా అనేది తేలటంలేదు. వీళ్ళతో సీపీఐ కలవటానికి సిద్ధంగా ఉందనే టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చాలా పెద్దభారాన్ని మోయాల్సుంటుంది.

చంద్రబాబు మీద భారం పెరిగిపోవడం ఖాయమా..?
X

వచ్చే ఎన్నికల్లో ఫార్టీ ఇయర్స్ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు మీద మోయలేనిభారం పడబోతోంది. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే పొత్తులు లేనిదే చంద్రబాబు ఎన్నికల్లో పోటీచేయలేరు. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత కీలకమైనది. ఒంటరిగా పోటీచేస్తే ఏమవుతుందో బాగా తెలుసు కాబట్టి ఎలాంటి ఛాన్స్ తీసుకోవాలని అనుకోవటంలేదు. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కలిసిన చేతులు ఎన్నికల్లో పొత్తుగా మారటం ఖాయమనే అనుకుంటున్నారు.

పొత్తనేది కేవలం జనసేనతో మాత్రమే ఉంటుందా లేకపోతే వామపక్షాలతో కూడా ఉంటుందా అనేది తేలటంలేదు. వీళ్ళతో సీపీఐ కలవటానికి సిద్ధంగా ఉందనే టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చాలా పెద్దభారాన్ని మోయాల్సుంటుంది. ఎలాగంటే పొత్తుల్లో మిత్రపక్షాలకు కనీసం 50 సీట్లన్నా కేటాయించాల్సుంటుంది. మామూలుగా అయితే సీట్లను కేటాయించేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ సీట్లతో అభ్యర్ధులను, నిధులను కూడా చంద్రబాబే సర్దుబాటుచేయాలి.

సీపీఐకి నిధులను సర్దటంతో పాటు జనసేనకు అభ్యర్ధులు, నిధులను కూడా చంద్రబాబే సర్దాలి. జనసేన వల్ల టీడీపీకి వచ్చేలాభం ఏమిటో తెలీదుకానీ భారంమాత్రం మోయలేనిదైపోతుంది. జనసేనకు పట్టుమని 25 సీట్లలో కూడా గట్టి అభ్యర్ధులు లేరు. అలాంటిది 45 సీట్లు ఇస్తారని అనుకుంటే అన్నినియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను ఎక్కడి నుండి తేవాలి..? పోయిన ఎన్నికల్లో మూడోప్లేసులో నిలబడిన అభ్యర్ధుల్లో చాలామంది ఇప్పుడు యాక్టివ్ గా లేరట. కాబట్టి కొత్తవారిని చూసుకోవాల్సిందే.

నామినేషన్ వేయటానికి ఎవరో ఒకరికి పవన్ బీఫారం ఇవ్వలేరు కదా. అందుకనే ఒకవైపు పొత్తు పెట్టుకుని మరోవైపు అభ్యర్ధులను కూడా చంద్రబాబే చూపించాల్సుంటుంది. చంద్రబాబు చూపించే అభ్యర్ధులంటే కచ్చితంగా టీడీపీ నేతలే అయ్యుంటారనటంలో సందేహంలేదు. ఇక నిధుల ఖర్చు మొత్తం చంద్రబాబు భరిస్తేనే వైసీపీ అభ్యర్ధులకు ఫైట్ ఇవ్వగలరు. లేకపోతే మిడిల్ డ్రాప్ ఖాయమే. ఇప్పటికే జనసేనకు కేటాయించే సీట్లలో అత్యధికం వైసీపీ ఖాతాలో పడటం ఖాయమని తమ్ముళ్ళల్లోనే చర్చ జరుగుతోంది. ఈ రకంగా జనసేనతో పాటు మిగిలిన పార్టీలకు కూడా నిధులు సర్దాలంటే చంద్రబాబుకు ఎంత భారమే అర్ధమవుతోంది.

First Published:  19 Oct 2022 12:16 PM IST
Next Story