Telugu Global
Andhra Pradesh

ప్రియురాలిని కత్తితో నరికి చంపి.. తర్వాత..

యువకుడు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

ప్రియురాలిని కత్తితో నరికి చంపి.. తర్వాత..
X

ఏలూరు జిల్లా సత్రంపాడులో దారుణం జరిగింది. ప్రియురాలిని అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపాడు ఓ ప్రియుడు. అనంతరం తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. యువకుడు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఏలూరు నగరంలోని ఎమ్మార్సీ కాలనీలో జక్కుల రత్న గ్రేసీ(22) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. తొట్టిబోయిన యేసురత్నం(23)తో గ్రేసీ కొంత కాలంగా ప్రేమలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రేసీ ఇంటికి వెళ్లిన యేసురత్నం తమ పెళ్లి చేయాలని యువతి తల్లిదండ్రులను అడిగాడు. అందుకు వారు నిరాకరించారు. గ్రేసీ కూడా పెళ్లి వద్దని చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు యేసురత్నం. సరైన సమయం కోసం వేచి చూశాడు. గురువారం మధ్యాహ్నం యువతి తన ఇంటి సమీపంలో ఉండగా వెంట తెచ్చుకున్న కత్తితో యేసురత్నం ఆమెను నరికి చంపాడు. తర్వాత తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

First Published:  30 May 2024 8:24 PM IST
Next Story