Telugu Global
Andhra Pradesh

బుక్ మై షో కాదు, 'బుక్ మై ఎమ్మెల్యే'.. పోస్టర్ల కలకలం

క్యూఆర్ కోడ్ లో వాసుపల్లి గణేష్ ఫొటో ఉంచారు. దానికింద 'బుక్ మై ఎమ్మెల్యే' అనే స్లోగన్ రాశాలు. డీల్స్ అవైలబుల్ - 40 పర్సెంట్ కమిషన్ అంటూ ఇంకాస్త కవ్వించే ప్రయత్నం చేశారు.

బుక్ మై షో కాదు, బుక్ మై ఎమ్మెల్యే.. పోస్టర్ల కలకలం
X

బుక్ మై షో కాదు, 'బుక్ మై ఎమ్మెల్యే'.. పోస్టర్ల కలకలం

ఇప్పటి వరకూ తెలంగాణలో వాల్ పోస్టర్ల కలకలం చూశాం, ఆమధ్య కర్నాటక ఎన్నికల్లో కూడా 'పేసీఎం' అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇలాంటి పోస్టర్లే ఇప్పుడు ఏపీలో కూడా వెలుగు చూశాయి. ఏపీలో ఎన్నికల హడావిడి ఇంకా మొదలు కాకముందే ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అందులోనూ అధికార పార్టీపై సెటైర్లు పడటంతో ఇది ఆసక్తికరంగా మారింది.

ఏపీలో టీడీపీ, జనసేన నుంచి కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. వచ్చే దఫా వారికి వైసీపీ టికెట్లు ఇస్తుందా లేదా అనేదానిపై పూర్తిగా క్లారిటీ లేదు. చీరాల, గన్నవరం వంటి నియోజకవర్గాల్లో దాదాపుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలుగానే ఫిరాయింపు నేతలు జనంలోకి వెళ్తున్నారు. విశాఖ విషయంలో వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రం ఆ స్థాయిలో స్థానిక వైసీపీ నేతలతో కలవలేకపోతున్నారు. ఈ క్రమంలో అక్కడే పోస్టర్లు పడ్డాయి. 'బుక్ మై ఎమ్మెల్యే' అంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాల్ పోస్టర్లు వేశారు కొంతమంది.

క్యూఆర్ కోడ్ లో వాసుపల్లి గణేష్ ఫొటో ఉంచారు. దానికింద 'బుక్ మై ఎమ్మెల్యే' అనే స్లోగన్ రాశాలు. డీల్స్ అవైలబుల్ - 40 పర్సెంట్ కమిషన్ అంటూ ఇంకాస్త కవ్వించే ప్రయత్నం చేశారు. టిడ్కో హౌస్ లు అమ్మబడును, దేవాలయ చైర్మన్ల పదవులు అమ్మబడును, పార్టీ పదవులు కూడా అమ్మబడును అంటూ వివరాలు పొందుపరిచారు. అయితే వైసీపీలో ఉన్న వాసుపల్లి వైరి వర్గం ఈ పని చేసిందా, లేక టీడీపీలో ఆయనంటే గిట్టనివారు ఈ పోస్టర్లు వేశారా అనేది తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో విశాఖ నాలుగు దిక్కులూ వైసీపీ ఓడిపోయింది, ఎంపీ స్థానం మాత్రం కైవసం చేసుకుంది. అంటే ఇక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ పడింది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం వైసీపీవైపు వచ్చారు కానీ అక్కడ ఇమడలేకపోతున్నారు. ఇప్పుడీ పోస్టర్ల కలకలంతో ఆయన మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు.

First Published:  28 Oct 2023 6:22 PM IST
Next Story