6 ఎంపీ, 12 ఎమ్మెల్యే సీట్లు అడగనున్న బీజేపీ.. బాబు ముఖచిత్రమేంటో?
పొత్తు ఇంకా పొడవక ముందే బీజేపీ పెడుతున్న షరతులకు బాబు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అండ లేకపోతే గెలవలేమని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఈ షరతులకు ఒప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది.
వైసీపీని ఓడించాలంటే జనసేనతో పొత్తు మాత్రమే చాలదని బీజేపీ అండ కూడా మెండుగా ఉండాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారు. అందుకే కమల దళాధిపతుల కంటిచూపు పడిన చాలన్నట్లు తహతహలాడుతున్నారు. వారితో పొత్తు కోసం పాకులాడుతున్నారు. తాజాగా చంద్రబాబు పొత్తు మాటల కోసమే ఢిల్లీ వెళుతున్నారు.
భారీగా సీట్లు కోరుతున్న బీజేపీ
అయితే పొత్తు ఇంకా పొడవక ముందే బీజేపీ పెడుతున్న షరతులకు బాబు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ అండ లేకపోతే గెలవలేమని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు కక్కలేక మింగలేక ఈ షరతులకు ఒప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఏకంగా 6 నుంచి 8 ఎంపీ సీట్లు, 12 నుంచి 15 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ అడుగబోతోందని విశ్వసనీయ సమచారం.
అంత సీనుందా?
కేంద్రంలో బీజేపీ ఎంత బలంగా ఉన్నా, రాష్ట్రంలో ఆ పార్టీకి ఎంత సీనుందో కమలనాథులకు కూడా తెలుసు. కానీ, పొత్తు అనేసరికి చెట్టెక్కి కూర్చుంటారు. భారీగా సీట్లు అడుగుతారు, ప్రాంతీయ పార్టీ మద్దతుతో ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించుకుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు చంద్రబాబుకు అవసరం కాబట్టి మళ్లీ కమలదళాధిపతులు అదే స్ట్రాటజీ ప్రయోగిస్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు ముఖ చిత్రమేంటో?