కన్నా బీజేపీ నుంచి జంప్.. మరీ ఏ పార్టీలోకి..?
బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. గుంటూరు ఈస్ట్ సీటు కన్నాకు కన్ఫామ్ అయిందని ఒక ప్రచారం.
కన్నా లక్ష్మీనారాయణ.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. కొంతకాలంగా పార్టీలో సైలెంట్. అధ్యక్షుడు మారిన తర్వాత అడపాదడపా పార్టీ ఆఫీసుకువచ్చారు. కానీ ఎక్కడా అంతా యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది.
బీజేపీలో సోము వీర్రాజుతో ఆయనకు గ్యాప్ ఉంది. అంతేకాకుండా కార్యక్రమాలకు పెద్దగా ఆయన్ను పిలవడం లేదు. ఈనాడు ఛైర్మన్ రామోజీరావుతో కన్నా భేటీ అయిన తర్వాత బీజేపీ పెద్దలకు కూడా ఆయన మీద నమ్మకం పోయిందట, ఆతర్వాత ఆయన ప్రస్తుత అధ్యక్షుడిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట.
బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. గుంటూరు ఈస్ట్ సీటు కన్నాకు కన్ఫామ్ అయిందని ఒక ప్రచారం. నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదని ఒక మాట. తనతో పాటు రాజకీయాల్లో నడుచుకుంటున్న 15 నుంచి 20 మంది అనుచరులతో కన్నా సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై.. తనకు వచ్చిన ఆఫర్లపై ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
కన్నా.. కాంగ్రెస్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్, రోశయ్య హయాంలో మంత్రిగా పనిచేశారు. గుంటూరు జిల్లాలో సీనియర్ నేత. అయితే ఆయన ఏజ్ పెరగడంతో కార్యకర్తలతో కూడా గ్యాప్‌వచ్చింది. దీంతో ఆయన ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ అయిన ఏ ప్రభావం చూపిస్తారనేది కాలమే సమాధానం చెప్పాలి.