పవన్‌కు బిగ్ షాక్.. పోతిన మహేష్ రాజీనామా
జనసేనలో పోతిన మహేష్ తొలి నుంచి ఉన్నారు. పవన్‌ను నమ్ముకునే పార్టీలో కొనసాగుతున్నారు. ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు.
చంద్రబాబు కూటమికి విజయవాడలో భారీ షాక్ తగిలింది. జనసేనకు షాక్ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పోతిన మహేష్ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఓ లేఖ విడుదల చేశారు. జనసేనకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు మహేష్.
జనసేనలో పోతిన మహేష్ తొలి నుంచి ఉన్నారు. పవన్‌ను నమ్ముకునే పార్టీలో కొనసాగుతున్నారు. ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే వెస్ట్ సీటుపై మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరకు టికెట్ కోసం పవన్‌తో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది.
విజయవాడ వెస్ట్ సీటు కోసం మొదటి నుంచి ఆసక్తికర రాజకీయం నడిచింది. సీటు కోసం టీడీపీ నుంచి ఇద్దరు నేతలు యత్నించగా.. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లొచ్చనే ప్రచారం నడిచింది. దీంతో ఆ సీటు తనకేనని పవన్ నుంచి మహేష్ మాట తీసుకున్నారు. ఈలోపు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బీజేపీ.. పొత్తులో భాగంగా ఆ సీటును తన్నుకుపోయింది. పవన్ ద్వారా చంద్రబాబు తన అనుచరుడు సుజనా చౌదరికి టికెట్ ఇప్పించుకున్నారు.
అయినా ఆశలు వదులుకోని మహేష్ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. పవన్‌పై చివరి నిమిషం వరకు నమ్మకం పెట్టుకున్నారు. అయినప్పటికీ చివరకు వేల కోట్లున్న బడా వ్యాపారి కోసం బీసీ నేత అయిన మహేష్‌ను పవన్ దగా చేశారు. పవన్‌ను నమ్మి తాను మోసపోయినట్లు మహేష్ ఇప్పుడు తన అనుచరుల వద్ద వాపోతున్నారు. అధికారంలోకి వస్తే.. ఏదైనా పదవి ఇస్తామని పవన్ ఆఫర్ చేసినప్పటికీ మహేష్ అందుకు లొంగకుండా జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పోతిన మహేష్ భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.