Telugu Global
Andhra Pradesh

ఏపీలో మందుబాబులకు భారీ షాక్

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది

ఏపీలో మందుబాబులకు భారీ షాక్
X

ఏపీలో మందుబాబులకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. డ్రగ్ రిహాబిలిటేషన్ సేస్ కింద దీన్ని వసూలు చేస్తుండగా, రూ.100 కోట్ల వరుకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిన్న మద్యం షాపులను లాగరీ ద్వారా కేటాయించగా రేపటి నుంచి నూతన లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. తాజా నిర్ణయం ప్రకారం.. అదనపు ప్రివిలేజ్‌ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. అంటే ఒకవేళ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 కనుక ఉంటే.. దానిని రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్‌ ఫీజు ఉంటుంది. విదేశీ మద్యం బాటిళ్లపై అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా.. తదుపరి పది రూపాయలకు పెంచారు.

ఒకవేళ క్వార్టర్ బాటిల్ ధర రూ.90.50 గా ఉంటే ఎపీఎఫ్ (ప్రివిలేజ్ ఫీజ్) కలిపి దాని ధర రూ రూ.100 అవుతుంది. అయితే ప్రభుత్వ ఆదేశాలతో క్వార్టర్ బాటిల్ ధర రూ. 99 కే నిర్ధారించడంతో.. రూ. 100 ధరలో రూ.1 మినహాయించి విక్రయిస్తారు.ఏపీలో లిక్కర్ సిండికేట్ దందా కొనసాగుతుంది. అక్కీడీప్‌లో మద్యం దుకాణాలు దక్కించుకున్నవారిని కొందరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ ఇప్పటికే పలువురికి వార్నింగ్ కూడా వెళ్లడంతో లాటరీ విజేతలు భయపడుతున్నారు. లైసెన్స్ ఫీజు చెల్లిస్తే తర్వాత తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాములు ఇస్తేనే లిక్కర్ షాపులు కొనసాగుతాయని బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్‌ జారీచేయగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీ ద్వారా లైసెన్సీలను ఎంపిక చేశారు.

First Published:  15 Oct 2024 10:36 AM GMT
Next Story