ఎన్నికల వేళ బాలకృష్ణకు దిమ్మతిరిగే షాక్
ఎన్నికల్లో తనకో లేదా తన కుమారుల్లో ఒకరికో పుట్టపర్తి టికెట్ ఇస్తారని నిమ్మల కిష్టప్ప ఆశించారు. కానీ పల్లె రఘునాథరెడ్డి కుటుంబానికి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు.
హిందూపురం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీ వైపు ఆయన చూస్తున్నారు. వైసీపీ కూడా కిష్టప్పను చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలు కిష్టప్పతో చర్చలు జరిపారని సమాచారం.
నిమ్మల కిష్టప్ప.. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో ప్రముఖ బీసీ నాయకుడు. చేనేత సామాజికవర్గానికి చెందిన నిమ్మల చంద్రబాబు కేబినెట్‌లో ఒకప్పుడు మంత్రి. హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన నేపథ్యం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిమ్మలకు టికెట్ ఇచ్చేది. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు నిమ్మలను టీడీపీలో పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు.
ఈ ఎన్నికల్లో తనకో లేదా తన కుమారుల్లో ఒకరికో పుట్టపర్తి టికెట్ ఇస్తారని నిమ్మల కిష్టప్ప ఆశించారు. కానీ పల్లె రఘునాథరెడ్డి కుటుంబానికి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. హిందూపురం ఎంపీ టికెట్‌పైనా నిమ్మల గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ, చివర్లో పార్థసారథి టికెట్‌ను తన్నుకుపోయారు. దీంతో టీడీపీలో నిమ్మల కుటుంబం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే తీవ్ర అవమాన భారంతో టీడీపీకి రాజీనామా చేశారు నిమ్మల కిష్టప్ప. మొత్తానికి చంద్రబాబు నాయకత్వంలో అనంతపురం జిల్లాలో మరో బీసీ నేత విజయవంతంగా తొక్కివేయబడ్డారనే చర్చ జరుగుతోంది.