Telugu Global
Andhra Pradesh

భువనేశ్వరే పెద్ద మైనస్సా?

భువనేశ్వరి, బ్రాహ్మణిల‌ తెలుగు చాలా ఘోరంగా ఉంది. ఇలాంటి భాషతో భువనేశ్వరి గనుక జనాల్లోకి వెళితే సానుభూతి సంగతి దేవుడెరుగు.. పార్టీకి ఆమే పెద్ద మైనస్ అవ్వటం ఖాయమనే అనిపిస్తోంది.

భువనేశ్వరే పెద్ద మైనస్సా?
X

నిజం గెలిచే మాట దేవుడెరుగు అసలు తెలుగుదేశంపార్టీకి భువనేశ్వరే పెద్ద మైనస్‌గా తయారయ్యేట్లున్నారు. ఇంతకాలం భువనేశ్వరి ప్రత్యక్షరాజకీయాల్లో ఎక్కడా కనబడలేదు కాబట్టి ఆమె గురించి తెలిసింది చాలా తక్కువ. చంద్రబాబునాయుడు స్కిల్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉండటంతో లోకేష్‌తో పాటు భువనేశ్వరి, బ్రాహ్మణి జనాల్లోకి వస్తున్నారు. దాంతో అత్తా కోడళ్ళ మాటలు విన్న జనాలకు షాక్ కొట్టినట్లయ్యింది.

ఇంతకీ విషయం ఏమిటంటే భువనేశ్వరి, బ్రాహ్మణిల‌ తెలుగు చాలా ఘోరంగా ఉంది. పరాయిభాష వాళ్ళ తెలుగు నేర్చుకుని మాట్లాడితే ఎలాగుంటుందో వీళ్ళు తెలుగు మాట్లాడటం అలాగే ఉంది. ఎన్టీయార్ సంతానం అంటే ఇతర విషయాలు ఎలాగున్నా తెలుగు భాష మీద మంచి పట్టుంటుందనే అనుకుంటారు. కానీ తెలుగు మాట్లాడటంపై ఎన్టీయార్, పురందేశ్వరికి తప్ప ఇంకెవరికీ పట్టున్నట్లు లేదు. నిజానికి సంతానంలో చాలా మందికి జనాలతో సంబంధాలు లేవు కాబట్టి ఎవరు ఎలా మాట్లాడుతారో కూడా తెలియ‌దు.

ఇప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి తరచూ జనాల్లోకి వస్తుండటం, మీడియాను కలుస్తుండటం వల్లే వీళ్ళ తెలుగు గురించి అందరికీ తెలిసింది. ఇలాంటి భాషతో భువనేశ్వరి గనుక జనాల్లోకి వెళితే సానుభూతి సంగతి దేవుడెరుగు.. పార్టీకి ఆమే పెద్ద మైనస్ అవ్వటం ఖాయమనే అనిపిస్తోంది. ఇంతకాలం లోకేష్‌కు మాత్రమే తెలుగు మాట్లాడటం సరిగా రాదని అనుకునేవాళ్ళు. అలాంటిది లోకేష్‌కు భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా తోడయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే కారణంతో భువనేశ్వరి ఈ రోజు అంటే బుధవారం నుండి ‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్రలు మొదలుపెడుతున్నారు.

చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించే పేరుతో మొదలుపెట్టబోతున్న యాత్రలో రోడ్డుషోలు, చిన్నపాటి సభలు కూడా ఉంటాయి. ఇలాంటి చోట్లంతా భువనేశ్వరి జనాలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇక్కడే ఆమె మాట్లాడే భాషపై పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇంత ఘోరమైన భాషతో భువనేశ్వరి మాట్లాడితే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానాలు పార్టీలో పెరిగిపోతున్నాయి. ఎలాగూ యాత్ర మొదలుపెడుతున్నారు కాబట్టి మొదటి రెండు సభల్లోనే భువనేశ్వరి వ్యవహారం తేలిపోతుంది.

First Published:  25 Oct 2023 10:27 AM IST
Next Story