Telugu Global
Andhra Pradesh

30 లక్షల మంది డేటా చోరీ అయింది- భూమన

టీడీపీకి చెందిన సేవా మిత్రా యాప్‌కు 30 లక్షల మంది డేటాను అనుసంధానం చేశారన్నారు. టీడీపీకి ఓటు వేసే అవకాశం లేనివారి ఓట్లను తొలగించేందుకు ఈ యాప్‌ ద్వారా పనిచేశారని భూమన వెల్లడించారు.

30 లక్షల మంది డేటా చోరీ అయింది- భూమన
X

టీడీపీ హయాంలో ప్రజల డేటాను చోరీ జ‌రిగింది నిజమేనని చెప్పారు హౌస్ క‌మిటీ చైర్మ‌న్ భూమన కరుణాకర్ రెడ్డి. డేటా చోరీపై ఏర్పాటైన హౌజ్ కమిటీని నేతృత్వం వహించిన భూమన కరుణాకర్ రెడ్డి మధ్యంతర రిపోర్టును అసెంబ్లీ ముందుంచారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండాల్సిన వ్యక్తుల డేటాను టీడీపీకి సంబంధించిన యాప్‌కు అందించారని విచారణలో తేలిందన్నారు. దీని వల్ల టీడీపీకి ప్రయోజనం కలిగే అవకాశం ఏర్పడిందన్నారు..

టీడీపీకి చెందిన సేవా మిత్రా యాప్‌కు 30 లక్షల మంది డేటాను అనుసంధానం చేశారన్నారు. టీడీపీకి ఓటు వేసే అవకాశం లేనివారి ఓట్లను తొలగించేందుకు ఈ యాప్‌ ద్వారా పనిచేశారని భూమన వెల్లడించారు.

దీనిపై మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనేక మందిని ఈ వ్యవహారంలో విచారించాల్సి ఉందన్నారు. అందువల్ల మధ్యంతర నివేదిక మాత్రమే ప్రస్తుతం అందజేస్తున్నామన్నారు. స్టేట్ డేటా సెంటర్‌లో ఉండాల్సిన సమాచారం సేవా మిత్రా యాప్‌కు తరలించడం నేరమేనన్నారు. టీడీపీ చర్యల వల్ల ప్రజల గోప్యతకు భంగం కలిగిందన్నారు. ఈ డేటా చోరీ చేసిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయించాల్సి అవసరం ఉందన్నారు భూమన.

First Published:  20 Sept 2022 12:29 PM IST
Next Story