ఉనికి కోసం అవస్థలు పడుతోందా? హౌస్ అరెస్ట్
భూకబ్జాలు, సంతకాల పోర్జరీ, హత్యలకు కుట్రలు, కిడ్నాప్‌లతో బీజీగా ఉన్న అఖిలపై పోలీసులు చాలా కేసులే నమోదు చేశారు. దాంతో ఈమెతో మాట్లాడటానికి కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు. అందుకనే నోటికొచ్చింది మాట్లాడుతూ గోలగోల చేస్తోంది.
షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్. జిల్లాలో తనను ఎవరూ పట్టించుకోవటంలేదు. రాబోయే ఎన్నికల్లో అసలు టికెట్ దక్కుతుందో లేదో కూడా తెలీదు. టికెట్ సంగతి పక్కనపెట్టేస్తే కనీసం తన గోడు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వటంలేదు. దాంతో ఇక లాభంలేదనుకుని కంపుచేయటం మొదలుపెట్టారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఉనికి కోసమే అని అర్ధమవుతోంది. ఇదంతా మాజీ మంత్రి అఖిల ప్రియ గురించే అని ఈపాటికే అర్థమయ్యే ఉంటుంది.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే శనివారం ఉదయం భూమా అఖిలను ఆళ్ళగడ్డలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డితో గొడవల కారణంగా అఖిలకు పోలీసులు ఇంటినుండి టయటకు అడుగుపెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. తొందరలోనే శిల్పా టీడీపీలోకి మారబోతున్నట్లు మూడు రోజుల క్రితం భూమా చెప్పారు. అఖిల మాటలకు శిల్పా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో చాలెంజ్‌లు చేసుకునే దాకా వెళ్ళింది. వచ్చే ఎన్నికల్లో భూమా నంద్యాలలో పోటీ చేయటానికి రెడీ అవుతున్నారు.
దాంతో ఈ రోజు ఉదయం బహిరంగ చర్చకు ముహూర్తం పెట్టుకున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆళ్ళగడ్డలో పోలీసు 30 యాక్ట్ ఉన్న కారణంగా ఇలాంటి బహరంగ చర్చలు నిర్వహించకూడదని భూమాకు చెప్పారు. అయినా అఖిల వినకపోవటంతో చేసేదిలేక పోలీసులు ఆమెను ఇల్లు దాటకుండా కట్టడి చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆళ్ళగడ్డ, నంద్యాలలో ఎక్కడి నుండి కూడా అఖిలకు టికెట్ దక్కే అవకాశాలు లేవని సమాచారం.
భూకబ్జాలు, సంతకాల పోర్జరీ, హత్యలకు కుట్రలు, కిడ్నాప్‌లతో బీజీగా ఉన్న అఖిలపై పోలీసులు చాలా కేసులే నమోదు చేశారు. కిడ్నాప్ ఘటనలో అఖిల 14 రోజుల రిమాండులో ఉండి బెయిల్‌పై వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అనేక ఘటనల్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాంతో ఈమెతో మాట్లాడటానికి కూడా చంద్రబాబు ఇష్టపడటంలేదు. పార్టీ నేతలు కూడా దూరం పెట్టేశారు. అందుకనే ఇప్పుడు అఖిల ఉనికి కోసం అవస్థలు పడుతున్నట్లుంది. అందుకనే నోటికొచ్చింది మాట్లాడుతూ గోలగోల చేస్తోంది.