Telugu Global
Andhra Pradesh

మినిస్టర్‌ కాకాణికి క్లీన్‌చిట్‌....రేవ్‌ పార్టీపై బెంగళూరు సీపీ క్లారిటీ

పార్టీలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు బెంగళూరు సీపీ బి.దయానంద.

మినిస్టర్‌ కాకాణికి క్లీన్‌చిట్‌....రేవ్‌ పార్టీపై బెంగళూరు సీపీ క్లారిటీ
X

రేవ్‌ పార్టీలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు బెంగళూరు సీపీ బి.దయానంద. పార్టీలో కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి చెందిన MLA స్టిక్కర్‌తో కారు దొరికినప్పటికీ..ఆయన కానీ, ఆయన సన్నిహితులు కానీ పార్టీలో లేరని స్పష్టం చేశారు సీపీ. అసలు ఈ రేవ్‌ పార్టీలో అసలు రాజకీయ నాయకుల ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. కానీ ఓ నటీమణి మాత్రం పార్టీలో పాల్గొన్నారని చెప్పిన సీపీ..ఆమె పేరును మాత్రం వెల్లడించలేదు.

101 మంది పార్టీకి హాజరైనట్లు గుర్తించామన్నారు సీపీ. పూర్తిగా సోదాలు నిర్వహించి నిషేధిత MDMA, హైడ్రో గంజా, కొకైన్‌తో పాటు అనేక రకాల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పార్టీ నిర్వహకులతో పాటు డ్రగ్స్‌ కలిగి ఉన్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. పోలీసులు సోదాలు చేస్తున్న టైంలో కొంత మంది డ్రగ్స్‌ను బయట స్విమ్మింగ్‌ పూల్‌లోకి విసిరేసేందుకు యత్నించారన్నారు సీపీ. ఫామ్‌హౌస్‌లో, వెహికిల్స్‌లో దాచిన డ్రగ్స్‌ను వెలికితీయడంలో డాగ్‌ స్క్వాడ్ కీలకంగా వ్యవహరించిందన్నారు

పట్టుబడిన వారిలో చాలా మంది హైదరాబాద్‌కు చెందిన టెకీలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సోదాల్లో 15 గ్రాముల HDMA, 6 గ్రాముల కొకైన్, 6 గ్రాముల హైడ్రో గంజాతో పాటు ఇతర మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్‌ డే పేరుతో ఈ పార్టీ నిర్వహించినట్లు సీపీ తెలిపారు. ఈ పార్టీ కోసం రోజుకు దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు అధికారులు. పార్టీకి హాజరైన అందరి నుంచి రక్త నమూనాలు సేకరించామన్న సీపీ....రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఫామ్‌హౌస్‌ బెంగళూరు రూరల్‌ పోలీసుల పరిధిలో ఉండడంతో కేసును హెబ్బగోడి పీఎస్‌కు బదిలీ చేశామని చెప్పారు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపైనా విచారణ కొనసాగిస్తామన్నారు సీపీ.

First Published:  21 May 2024 5:15 PM IST
Next Story