Telugu Global
Andhra Pradesh

బకాయిల చంద్రబాబు.. ఎన్నికల ముందే హడావుడి

షాదీ తోఫా కింద జగన్‌ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారులకు సాయం విడుదల చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వధువుకు సాయం అందిస్తే జగన్‌ ప్రభుత్వం వధువు తల్లికి అందిస్తోంది.

బకాయిల చంద్రబాబు.. ఎన్నికల ముందే హడావుడి
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన హయాంలో ఇచ్చిన ఏ హామీని పూర్తిగా అమ‌లు చేయ‌లేదు. అధికారం నుంచి దిగిపోయే నాటికి దాదాపు అన్ని పథకాల ల‌బ్ధిదారుకు బకాయిలు పెట్టారు. త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన‌ వైఎస్‌ జగన్‌ ఆ బకాయిలను చెల్లించడంతో పాటు వివిధ సంక్షేమ ప‌థ‌కాలను ప్ర‌వేశ‌పెట్టి పకడ్బందీగా వాటిని అమలు చేశారు. ప్ర‌భుత్వ సాయాన్ని నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాలోనే జ‌మ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులకు చెందిన 56,194 జంటలకు వైస్సార్‌ కళ్యాణ మస్తు, షాదీ తోఫా కింద జగన్‌ ప్రభుత్వం రూ.427.27 కోట్లు అందించింది. చంద్రబాబు అధికారంలో ఉన్న‌ప్పుడు దుల్హన్ పథ‌కం కింద ముస్లిం మైనార్టీల‌కు అందించిన సాయం అరకొర మాత్రమే. 2018లో ఎన్నికలకు ముందు హడావిడిగా రూ.25 వేల సాయాన్ని రూ.50 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే పెంచిన మొత్తాన్ని ల‌బ్ధిదారుల‌కు ఇవ్వ‌కుండా మోసం చేశారు. దుల్హన్ పథ‌కం కింద దాదాపు రూ,177.96 కోట్లు బకాయిలు పెట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను విడుదల చేసింది.

షాదీ తోఫా కింద జగన్‌ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారులకు సాయం విడుదల చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వధువుకు సాయం అందిస్తే జగన్‌ ప్రభుత్వం వధువు తల్లికి అందిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం లబ్ధిదారులను గ్రామీణ ప్రాంతాల్లోని ఐకేపీల పరిధిలోని మండల సమాఖ్య ద్వారా ఎంపిక చేస్తే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎంపిక చేస్తోంది.

First Published:  6 April 2024 9:00 AM GMT
Next Story