Telugu Global
Andhra Pradesh

పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయొద్దు.. వైసీపీకి బండ్ల గణేష్ విజ్ఞప్తి

అందరూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తున్నారు. జీవితంలో కొన్ని విషయాలు ఆయన ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు కాబట్టే ఆయనపై విమర్శలు చేస్తున్నారు.

పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయొద్దు.. వైసీపీకి బండ్ల గణేష్ విజ్ఞప్తి
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయవద్దని ఆయన అభిమాని, సినీ నిర్మాత బండ్ల గణేష్ ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశాడు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో బండ్ల గ‌ణేష్‌ మాట్లాడుతూ.... `ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. సార్ మీరు పెద్ద హోదాలో ఉన్నారు. భగవంతుడు మీకు అద్భుతమైన పొజిషన్ ఇచ్చారు. పవన్ తో మూడు దశాబ్దాల నుంచి తిరుగుతున్నా కాబట్టి ఆయన గురించి చెబుతున్నా. ఆయన ఎంతో నిజాయితీ పరుడు, నీతివంతుడు. ఎవరు కష్టాల్లో ఉన్నా ఆ కష్టం నాది అని ముందుకు వెళ్లే వ్యక్తి.

అందరూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తున్నారు. జీవితంలో కొన్ని విషయాలు ఆయన ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు కాబట్టే ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఆయనను విమర్శించడానికి మరో కారణం లేదు. పవన్ కు సంబంధం లేకుండా కొన్ని విషయాలు జరిగిపోయాయి. వాటి గురించి పదే పదే విమర్శలు చేయవద్దని విన్నవిస్తున్నాను.

పవన్ కళ్యాణ్ హాయిగా సినిమా షూటింగులు చేసుకుంటూ సూపర్ స్టార్ హోదాను అనుభవించవచ్చు. కానీ, జనాలకు ఏదైనా చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చాడు. రాత్రింబవళ్లు షూటింగ్ లో పాల్గొని వచ్చిన డబ్బును కూడా పార్టీ కోసమే ఉపయోగిస్తున్నాడు. తెలిసీ తెలియకుండా పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయవద్దని కోరుతున్నాను' అని బండ్ల గణేష్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

First Published:  13 Oct 2023 1:20 PM IST
Next Story