Telugu Global
Andhra Pradesh

బ్రేకింగ్: అవినాష్ రెడ్డికి బెయిల్

మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ఈరోజు తుది తీర్పు విడుదల చేసింది హైకోర్టు. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేసింది.

బ్రేకింగ్: అవినాష్ రెడ్డికి బెయిల్
X

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయకుండా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ లభించింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులోని వెకేషన్ బెంచ్ ఈ కేసు విచారించాల్సిందిగా సుప్రీం ఆదేశించడంతో ఇటీవల విచారణ జరిగింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ఈరోజు తుది తీర్పు విడుదల చేసింది హైకోర్టు. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేసింది.

అరెస్ట్ అవసరం లేదు..

విచారణకు పూర్తిగా సహకరిస్తున్నందున ఆయన అరెస్ట్ అవసరం లేదంటూ అవినాష్ రెడ్డి తరపు లాయర్లు కోర్టులో వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్‌.. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. వివేకా హత్య కేసులో కస్టడీ విచారణ అవసరం లేదని బెంచ్‌ అభిప్రాయపడింది.

బెయిల్ పిటిషన్లో మలుపులు..

ముందస్తు బెయిల్‌ కోసం ఏప్రిల్‌ 17వ తేదీన అవినాష్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి ఆ పిటిషన్‌ విచారణ అనేక మలుపులు తిరిగింది. చివరికి.. సుప్రీం కోర్టు జోక్యంతో తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ పిటిషన్ ని విచారణకు తీసుకుంది. అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ పిటిషన్‌ వేసే హక్కు ఉందని, పిటిషన్‌ పై వాదనలు వినాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో విచారణ జరిపిన వెకేషన్ బెంచ్ ఈరోజు తుది తీర్పు ఇచ్చింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.


అవినాష్ కి కోర్టు విధించిన షరతులు..

- సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు

- సాక్షులను ప్రభావితం చేయకూడదు

- సీబీఐ దర్యాప్తుకి సహకరించాలి

- జూన్‌ నెలాఖరు వరకు ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరుకావాలి

- ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలి

- సీబీఐకి అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలి

- షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చు

- అరెస్టు చేసినట్లయితే రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్‌ పై విడుదల చేయాలని సీబీఐకి ఆదేశం

First Published:  31 May 2023 10:50 AM IST
Next Story