Telugu Global
Andhra Pradesh

జూ. వైఎస్‌ఆర్ ట్వీట్ చూశా- జూ.ఎన్టీఆర్‌పై బాబు గోగినేని వివాదాస్పద వ్యాఖ్యలు

జూ.ఎన్టీఆర్ నాగపూర్‌- గుడివాడ మధ్య ఊగిసలాట ఆడుతున్నారని మండిపడ్డారు. రాజకీయం అంటే డైలాగ్‌లు కొట్టడమా.. పాలసీ గురించి అవగాహన ఉండవద్దా అని ప్రశ్నించారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును కేవలం గిల్లడం కోసమే మార్చార‌ని బాబు గోగినేని విమర్శించారు.

జూ. వైఎస్‌ఆర్ ట్వీట్ చూశా- జూ.ఎన్టీఆర్‌పై బాబు గోగినేని వివాదాస్పద వ్యాఖ్యలు
X

జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ నుంచి దాడి మొదలైంది. వైఎస్‌ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రజాదరణ కలిగిన నాయకులే అంటూ జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేయడం వారికి కోపాన్ని తెప్పించింది. తాజాగా హేతువాది బాబు గోగినేని కూడా జూనియర్‌పై విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను.. జూ. వైఎస్‌ఆర్‌గా అభివర్ణించారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ను జూనియర్ వైఎస్‌ఆర్‌ అని బాబు గోగినేని విమర్శించారు. ఎన్టీఆర్ మనవడు కాబట్టి సీన్‌లోకి వచ్చి ట్వీట్ చేసిన జూ.ఎన్టీఆర్‌ .. ఏదీ తేల్చకుండా సమన్యాయం చేస్తా అన్నట్టు ట్వీట్ చేశారని విమర్శించారు. నేరుగా ప్రశ్నించే దమ్ము కూడా ఈ హీరోలకు లేదా అని నిల‌దీశారు.

జూ.ఎన్టీఆర్ నాగపూర్‌- గుడివాడ మధ్య ఊగిసలాట ఆడుతున్నారని మండిపడ్డారు. రాజకీయం అంటే డైలాగ్‌లు కొట్టడమా.. పాలసీ గురించి అవగాహన ఉండవద్దా అని ప్రశ్నించారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును కేవలం గిల్లడం కోసమే మార్చార‌ని బాబు గోగినేని విమర్శించారు.

50,100 ఏళ్లలో దేశాలే మాయమైపోతున్నాయని ఇక మనుషులెంత అని ప్రశ్నించారు. ఏ పార్టీ వారికి ఆ పార్టీ నాయకుడు గొప్పగా కనిపిస్తారని,.. ఒక దశలో జయలలితకు నోబెల్ ఫ్రైజ్ ఇవ్వాలని అన్నాడీఏంకే నేతలంతా నార్వేకు లేఖలు రాసిన ఉదంతం కూడా ఉందన్నారు. ఇవన్నీ డ్రామాలు అన్నారు.

తమ నేతల మీద అభిమానం ఉంటే వ్యక్తిగతంగా చూపుకోవాలని, వారి పిల్లలకు ఆయా నేతల పేర్లు పెట్టుకోవాలని సూచించారు. ఏపీలోని హెల్త్ స్కీంలకు ఎన్టీఆర్‌ గానీ, టీడీపీ గానీ, వైసీపీ గానీ, వైఎస్‌ఆర్‌ గానీ సొంత నిధులేమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. కేవలం పాలసీని తెచ్చి ఉండవచ్చన్నారు. రాజకీయాలు కుటుంబాల చేతుల్లోకి వెళ్లిపోవడం, ఆయా పార్టీ వారిలో అభిమానం హద్దులు మీరడం వల్లనే ఇలా పేర్లు పెట్టాలన్న ఆలోచనలు మొదలయ్యాయని విమర్శించారు.

First Published:  23 Sept 2022 2:28 AM GMT
Next Story