గోరంట్ల మాధవ్‌పై బాబు గోగినేని ఫైర్
రేప్, లైంగిక వేధింపులు, మహిళల బట్టలు విప్పే ప్రయత్నం చేయడం వంటి తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్న 41 మందికి పార్టీలు టికెట్లు ఇచ్చాయని.. వారిలో వీడు ఒకడు అంటూ బాబు గోగినేని ఫైర్ అయ్యారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై బాబు గోగినేని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో, పార్లమెంట్‌లో అందరూ ఏపీ గురించే మాట్లాడుకునే పరిస్థితిని గోరంట్ల మాధవ్ తీసుకొచ్చారని విమర్శించారు. బహుశా ఏపీకి ఇంతకు మించి ప్రత్యేక హోదా రాబోదేమో అని వ్యాఖ్యానించారు. నవరత్నాల్లో ఇతడు నాలుగో రత్నం అని అభివర్ణించారు.
ఇలాంటి లేకిగాళ్లంతా ప్రజాజీవితంలోకి వచ్చేసి మొత్తం కలుషితం చేశారని మండిపడ్డారు. పార్టీలు కూడా నిర్లజ్జగా నేరస్తులకు టికెట్లు ఇచ్చి పార్లమెంట్‌కు పంపుతున్నాయన్నారు. 2014 నుంచి 2019 వరకు పార్లమెంట్‌లో క్రిమినల్ ఎంపీలు 30 శాతం పెరిగారన్నారు.
రేప్, లైంగిక వేధింపులు, మహిళల బట్టలు విప్పే ప్రయత్నం చేయడం వంటి తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్న 41 మందికి పార్టీలు టికెట్లు ఇచ్చాయని.. వారిలో వీడు ఒకడు అంటూ బాబు గోగినేని ఫైర్ అయ్యారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత గోరంట్ల మాధవ్ మీడియా సమావేశంలో బెదిరిస్తూ మాట్లాడిన తీరు బట్టే అతడి క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోందన్నారు. ఒక వికృతమైన వ్యక్తిగా మారి.. ఇతరులను తిట్టడమేంటని ప్రశ్నించారు. మొన్నటి దాక పోలీసు శాఖలో పనిచేసిన వ్యక్తి ఇంత చట్టవిరుద్ధంగా ఎలా మాట్లాడుతున్నారని నిలదీశారు.
అందరూ గోరంట్ల మాధవ్‌ది న్యూడ్ వీడియో అంటున్నారని.. కేవలం బట్టలు లేకుండా ఉంటే దాన్ని న్యూడ్ వీడియో అంటారే గానీ.. గోరంట్ల మాధవ్‌ది సెక్స్ టేపు అని బాబు గోగినేని వ్యాఖ్యానించారు. అవతలి మహిళ వేధింపులను తట్టుకోలేక ఆ వీడియోను బయటపెట్టి ఉండవచ్చన్నారు. పైగా మీడియా సమావేశంలో గోరంట్ల మాధవ్‌కు మద్దతు క్రిస్టియన్ సంఘం నాయకుడు వచ్చారని.. కాబట్టి మిగిలిన క్రైవస్త సంఘాల వారు... సదరు వ్యక్తితో తమకు సంబంధం లేదని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ కాబట్టే మాధవ్‌ను టార్గెట్ చేశారంటూ కుల కోణాన్ని కూడా తీసుకొస్తున్నారని.. అతడు చేసిన పనికి కులం ఎలా బాధ్యత వహిస్తుందని నిలదీశారు. బీసీ సంఘాల నేతలు కూడా గోరంట్ల మాధవ్ చేసిన నీచమైన పనికి తాము మద్దతు ఇవ్వబోమని ప్రకటించాలని బాబు గోగినేని విజ్ఞప్తి చేశారు.