ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం
ఇప్పటివరకు అయ్యన్నపాత్రుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. పలుసార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఏపీలో ఇవాళ కొత్త శాసనసభ కొలువుదీరిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. రేపు స్పీకర్ ఎన్నిక. అయితే స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అయ్యన్నపాత్రుడు తరపున కూటమి నాయకులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడు టీడీపీలో సీనియర్ నాయకుడు. ఎన్టీఆర్ టీడీపీని 1983లో ఏర్పాటు చేయగా.. అదే సంవత్సరం తొలిసారి నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇప్పటివరకు అయ్యన్నపాత్రుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. పలుసార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, కూటమిలో మరొక కీలక భాగస్వామి అయిన జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. పంతం నానాజీ, లోకపు మాధవి పేర్లలో ఒకరి పేరును డిప్యూటీ స్పీకర్ పదవికి ఖరారు చేసే అవకాశం ఉంది.