Telugu Global
Andhra Pradesh

తెలంగాణ ఆర్టీసీ జోరు సరే.. ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఏంటి..?

పండగ వేళ కూడా ఏపీ ఆర్టీసీకి ఆదాయం పెరగడం కష్టం. కనీసం ఆ ప్రయత్నం కూడా ఏపీఎస్ఆర్టీసీ చేయకపోవడమే ఇక్కడ విశేషం.

తెలంగాణ ఆర్టీసీ జోరు సరే.. ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఏంటి..?
X

పండగలొచ్చినా, ఇంకేదయినా ప్రత్యేక సందర్భాలొచ్చినా తెలంగాణ ఆర్టీసీ మీడియాలో హైలైట్ అవుతుంది. స్పెషల్ బస్సులు, ఆకర్షణీయమైన రాయితీలు, బహుమతులు అంటూ టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు దగ్గరవుతుంది. మరి ఏపీఎస్ఆర్టీసీ సంగతేంటి..? పండగలకు పబ్బాలకు స్పెషల్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ ఎందుకు కేటాయించలేదు. ఒకవేళ స్పెషల్ బస్సులు వేసినా స్పెషల్ చార్టీలు ఎందుకు వసూలు చేస్తారు..? బహుమతులతో ప్రయాణికుల్ని ఆకట్టుకునే ఆలోచన ఏపీలోని ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు చేయట్లేదు..? దీనికి సమాధానాలు వెదికినా దొరకవు.

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలిపేసుకునే క్రమంలో సాక్షిలో బాగా హడావిడి జరిగింది. ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కాపీ కొట్టిందని వార్తలిచ్చింది. ఏపీలో ఆర్టీసీ విలీనం సందర్భంలో కౌంటర్లిచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తమ రూట్లోకే వచ్చిందని కథనాలు ప్రసారం చేసింది. అక్కడ సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీని పొగుడుతూ సాక్షి కథనాలివ్వాల్సిన పరిస్థితి. బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఆఫర్లను ఏపీ ప్రజలకు చేరవేయాల్సిన పరిస్థితి సాక్షికి వచ్చింది. పరోక్షంగా ఏపీఎస్ఆర్టీసీ దయనీయ పరిస్థితిని ప్రభుత్వ మీడియానే జనాలకు పరిచయం చేస్తోందనమాట.

పండగల వేళ హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంతూళ్లకు వచ్చేవారు ఎక్కువగా టీఎస్ఆర్టీసీనే ఎంపిక చేసుకుంటారు. తిరుగు ప్రయాణంలో కూడా ఆఫర్లున్నాయి కాబట్టి టీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తారు. అంటే పండగ వేళ కూడా ఏపీ ఆర్టీసీకి ఆదాయం పెరగడం కష్టం. కనీసం ఆ ప్రయత్నం కూడా ఏపీఎస్ఆర్టీసీ చేయకపోవడమే ఇక్కడ విశేషం. పొరుగు రాష్ట్రం ఆఫర్లతో ఆదాయం పట్టుకెళ్తుంటే.. చోద్యం చూడటం మినహా ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఉద్యోగుల్ని కాస్త ఆలస్యంగా ప్రభుత్వంలో విలీనం చేసినా.. సంస్థ అభివృద్ధి, సత్ఫలితాల్లో టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ కంటే చాలా ముందు ఉంది.

First Published:  12 Oct 2023 12:00 PM IST
Next Story