AP:ఐ ప్యాక్ సర్వే పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్...31 మంది మంత్రులు, మాజీలు ఔట్?
ఏబీఎన్ వెలువరించిన వివరాల ప్రకారం.... ఐ ప్యాక్ సర్వేలో ప్రస్తుత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, నారాయణస్వామి, పినిపె విశ్వరూప్, దాడిశెట్టి రాజా లు తప్ప మిగతా అందరూ ఓడిపోతారని ఐ ప్యాక్ తెలిపినట్టు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైఎస్సార్ సీపీ ఓటమి తప్పదా ? ప్రస్తుతం ఉన్న 25 మందిమంత్రుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 20 మంది ఓడిపోతారా ? 13 మంది మాజీమంత్రుల్లో 11 మందికి ఓటమి తప్పదా ? అవునంటోంది 'ఐ ప్యాక్' పేరుతో హల్ చల్ చేస్తున్న ఓ సర్వే . ఈ సర్వే సోషల్ మీడియాలో లీక్ అయ్యిందంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్చాకార్యక్రమం నిర్వహించింది. ఈ ఐ ప్యాక్ సంస్థ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందినది. వైసీపీ తన ఎన్నికల వ్యూహకర్తగా ఐ ప్యాక్ సంస్థను నియమించుకొన్న విషయం తెలిసిందే.
ఏబీఎన్ వెలువరించిన వివరాల ప్రకారం.... ఐ ప్యాక్ సర్వేలో ప్రస్తుత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, నారాయణస్వామి, పినిపె విశ్వరూప్, దాడిశెట్టి రాజా లు తప్ప మిగతా అందరూ ఓడిపోతారని ఐ ప్యాక్ తెలిపినట్టు చెప్పారు.
మాజీ మంత్రుల్లో ధర్మాన కృష్ణదాస్, కొడాలి నాని మాత్రమే మళ్లీ గెలిచే అవకాశముందని ఈ సర్వే చెబుతోంది.
ఇరవై మంది ఓడిపోయే మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, అంబటి రాంబాబు,బూడి ముత్యాల నాయుడు,ఉషశ్రీ చరణ్, రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, సీదిరి అప్పలరాజు,తానేటి వనిత, గుడివాడ అమర్‌నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేశ్, విడదల రజిని, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, గుమ్మనూరి జయరాం, కాకాణి గోవర్ధన రెడ్డి, మేరుగు నాగార్జున ఉన్నారు.
ఏబీఎన్ చూపిస్తున్న సర్వే రిపోర్ట్ పై ఐ ప్యాక్ సంస్థ వాటర్ మార్క్ ఉంది. ఈ నెలలోనే ఈ సర్వే నిర్వహించినట్టు చెప్తున్నారు. ఈ సర్వే సోషల్ మీడియాలో లీక్ అయ్యిందని ఏబీఎన్ చెప్తోంది. ఒక్క మంత్రులకు సంబంధించిన సర్వే వీడియో క్లిప్ మాత్రమే లీక్ అయ్యిందని, ఎమ్మెల్యేలకు సంబంధించివివరాలు తెలియరాలేదని ఏబీఎన్ పేర్కొంది.
ఈ సర్వే నిజానిజాలు ఐ ప్యాక్ వెల్లడించాల్సి ఉంది.