Telugu Global
Andhra Pradesh

APPSC రికార్డ్.. 27 రోజుల్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు

గ్రూప్-1 పరీక్ష రాసిన వాళ్లలో 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. మొత్తం 81 పోస్ట్ ల భర్తీకోసం 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు.

APPSC రికార్డ్.. 27 రోజుల్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు
X

ఎన్నికలతో సంబంధం లేకుండా APPSC తనపని తాను చేసుకుంటూ పోతోంది. ఇటీవలే గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన సంస్థ, ఇప్పుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు కూడా విడుదల చేసింది. మార్చి 27న గ్రూప్-1 పరీక్ష జరుగగా.. ఏప్రిల్ 12 ఫలితాలు విడుదలయ్యాయి. అంటే కేవలం 27 రోజుల్లోనే ఫలితాలు వచ్చాయనమాట. గతంలో కూడా ఇదే స్పీడ్ తో ఫలితాలు విడుదల చేసిన రికార్డ్ APPSCకి ఉన్నా.. ఇప్పుడున్న ఎన్నికల హడావిడిలో కూడా రిజల్ట్ ఇవ్వడం విశేషం.

గ్రూప్-1కి మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్లలో 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. మొత్తం 81 పోస్ట్ ల భర్తీకోసం 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌-2 నుంచి 9వతేదీ మధ్యలో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని APPSC ప్రకటించింది.

ఏపీలో వరుసగా గ్రూప్-1, గ్రూప్-2, డిప్యూటీ ఈవో, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు జరిగి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఎన్నికల తర్వాత ఈ రెండిటికి సంబంధించి మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. డిప్యూటీ ఈవో పరీక్ష వాయిదా పడింది, ఎన్నికల తర్వాత పరీక్ష నిర్వహిస్తారు. కోర్టు కేసులతో టెట్, డీఎస్సీ కూడా వాయిదా పడ్డాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నియామకాల భర్తీ ఉంటుంది.

First Published:  13 April 2024 7:35 AM IST
Next Story