Telugu Global
Andhra Pradesh

బ్లూ ఫిల్మ్ లంటూ దిగజారిన వ్యాఖ్యలు.. బండారుకోసం సిద్ధమైన బేడీలు

ప్రెస్ మీట్ లో బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని తన లేఖలో పేర్కొన్నారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. బండారును అరెస్టు చేయాలంటూ డీజీపీకి లేఖ రాశారు.

బ్లూ ఫిల్మ్ లంటూ దిగజారిన వ్యాఖ్యలు.. బండారుకోసం సిద్ధమైన బేడీలు
X

మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకి మహిళా రాష్ట్రపతి ఆమోదం తెలిపిన రోజే.. సాక్షాత్తూ ఓ మహిళా మంత్రిపై దారుణ వ్యాఖ్యలు బయటకు రావడం దురదృష్టకరం. ప్రెస్ మీట్ పెట్టి మరీ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన దగ్గరున్న వీడియోలు బయటపెడితే రోజా, ఆమె భర్త ఆత్మహత్య చేసుకుంటారని, ఆమె కుటుంబం చిన్నాభిన్నమవుతుందని హెచ్చరించారాయన. ఈ హెచ్చరికలు, అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలంటూ డీజీపీకి లేఖ రాశారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ.

వాస్తవానికి ఈ లేఖ కంటే ముందే బండారుపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా వీడియో వైరల్ గా మారడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. ఆ తర్వాత సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో మహిళా కమిషన్ కర్తవ్యాన్ని గుర్తు చేశారు. జాతీయ మహిళా కమిషన్ ని కూడా ట్యాగ్ చేస్తూ ఆయన బండారు ఇంటర్వ్యూ లింక్ ని షేర్ చేశారు. దీంతో వ్యవహారం మరింత రచ్చగా మారింది. కాసేపటి క్రితం మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. టీడీపీ నేత బండారు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్.. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసింది.

ప్రెస్ మీట్ లో బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని తన లేఖలో పేర్కొన్నారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.ఒక మంత్రిపై, రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్ లు పెట్టి మరీ.. బండబూతులు మాట్లాడుతున్నారని.. వీటిని ఎంత మాత్రం సహించరాదని పేర్కొన్నారు. వెంటనే కేసు నమోదు చేసి బండారుని అరెస్టు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై పలువురు మహిళా నేతలు, న్యాయవాదులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తున్నామన్నారు వాసిరెడ్డి పద్మ.

First Published:  30 Sept 2023 3:35 PM IST
Next Story