Telugu Global
Andhra Pradesh

ఏపీలో టెన్త్ ఫలితాలు.. 38 స్కూల్స్ లో ఒక్కరూ పాస్ కాలేదు

ఆంధ్రప్రదేశ్ లో 933 పాఠశాలల్లో నూటికి నూరుశాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 38 పాఠశాలల్లో కనీసం ఒక్కరు కూడా పాస్ కాకపోవడం విచారకరం.

AP SSC Results 2023: ఏపీలో టెన్త్ ఫలితాలు.. 38 స్కూల్స్ లో ఒక్కరూ పాస్ కాలేదు
X

AP SSC Results 2023: ఏపీలో టెన్త్ ఫలితాలు.. 38 స్కూల్స్ లో ఒక్కరూ పాస్ కాలేదు

ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇటీవల ఇంటర్ ఫలితాల లాగే ఇప్పుడు టెన్త్ ఫలితాల్లో కూడా అమ్మాయిలదే పైచేయి. అబ్బాయిలు, అమ్మాయిల పాస్ పర్సంటేజ్ మధ్య గ్యాప్ కూడా ఎక్కువే. పది పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,64,152 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 6.09 లక్షలమంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, మిగతా వారు ప్రైవేట్ గా పరీక్ష రాశారు. 72.26శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

బాలికలదే పైచేయి..

అమ్మాయిల్లో 75.38శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల్లో కేవలం 69.27శాతం మంది మాత్రమే పరీక్ష పాసయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా పరీక్ష ఫలితాల్లో మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో ఉత్తీర్ణత శాతం 87.47 . నంద్యాల జిల్లా 60.39 శాతం పాస్ పర్సంటేజ్ తో ఆఖరి స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో 933 పాఠశాలల్లో నూటికి నూరుశాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 38 పాఠశాలల్లో కనీసం ఒక్కరు కూడా పాస్ కాకపోవడం విచారకరం. 38 స్కూల్స్ జీరో పర్సెంట్ రిజల్ట్ సాధించాయి. ఇక ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 95.02 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు.

సప్లిమెంటరీపై ప్రకటన..

టెన్త్ క్లాస్ ఫెయిలైన విద్యార్థులకోసం జూన్ 2 నుండి 10వతేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. మే 17 లోపు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేట్ ఫీజ్ తో మే 22 వరకు గడువు ఇచ్చారు. పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు వేసవి సెలవల్లోనే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని ప్రకటించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఈ నెల 13వతేదీ తుది గడువుగా నిర్ణయించారు.

పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ. తల్లిదండ్రులు తమ పిల్లలను మానసికంగా బలోపేతం చేయాలన్నారు. ఒక ఏడాది పోయినా.. జీవితం చాలా ఉంటుందని, ఓటమిని గెలుపునకు పునాదిగా భావించాలని చెప్పారు బొత్స.

First Published:  6 May 2023 9:37 AM GMT
Next Story