వాళ్ల టైమ్ లైన్ పై అంబేద్కర్.. వీళ్ల టైమ్ లైన్ మొత్తం దువ్వాడ
అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని వైసీపీ నిలదీస్తోంది. టీడీపీ ఇదేం పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో ఏకైక సమస్య దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మేటర్ అన్నట్టుగా ట్వీట్లు వేస్తోంది.
ఏపీలో ఎవరి గోల వారిది అన్నట్టుగా రాజకీయం మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఏపీలో జరుగుతున్న దాడుల్ని హైలైట్ చేస్తూ రాష్ట్రపతి పాలన కోసం డిమాండ్ చేసిన వైసీపీ ఇప్పుడు అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. కొవ్వొత్తుల ప్రదర్శన, అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, కూటమి ప్రభుత్వానికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, రాజ్యాంగకర్తనే అవమానించారని ఆరోపిస్తున్నారు. దాదాపుగా వైసీపీకి చెందిన మీడియా, సోషల్ మీడియాలో ఇవే వార్తలు కనపడుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా టైమ్ లైన్ పై మొత్తం ఇవే వార్తలున్నాయి.
విజయవాడలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడిని ముక్తకంఠంతో ఖండించిన వైయస్ఆర్సీపీ నేతలు
— YSR Congress Party (@YSRCParty) August 11, 2024
ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించి.. ప్రజాస్వామ్యవాదులు స్పందించాలన్న నేతలు
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ pic.twitter.com/Cx3LRWnK6R
టీడీపీ మాత్రం తమకిదేం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఏకైక సమస్య దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మేటర్ అన్నట్టుగా టీడీపీ తరపున ట్వీట్లు పడుతున్నాయి. దువ్వాడ భార్య, స్నేహితురాలి మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని హైలైట్ చేస్తూ వైసీపీని టార్గెట్ చేయాలని చూస్తోంది. ఆమె కార్ యాక్సిడెంట్, ఆమెకు జరుగుతున్న చికిత్స, తదనంతర పరిణామాల్ని విశ్లేషిస్తూ టీడీపీ ట్వీట్లు వేస్తోంది. వ్యక్తిగత విషయాలను అధికార పార్టీకి చెందిన ట్విట్టర్ హ్యాండిల్ ఇంతలా ఫోకస్ చేయడం విచిత్రమే అయినా.. ఆయన వైసీపీ ఎమ్మెల్సీ కావడంతో ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవాలనుకోవడంలేదు టీడీపీ.
ఏంటిది.. నిజమా ? ♂️#FekuJagan #EndOfYCP
— Telugu Desam Party (@JaiTDP) August 11, 2024
#AndhraPradesh pic.twitter.com/Ly6ltCNGsO
ఎవరిగోల వారిది..
ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారంలో వైసీపీ పూర్తిగా మౌనవ్రతం పాటిస్తోంది. ఏపీలో అంత రచ్చ జరుగుతున్నా సాక్షిలో కనీసం ఒక్క వార్త కూడా లేదు. పోనీ ఆ రోడ్ యాక్సిడెంట్ వ్యవహారాన్ని కూడా అస్సలు చూపించలేదు. వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఎక్కడా దువ్వాడ ప్రస్తావన లేదు. వైసీపీ నేతలు కూడా ఆయన గురించి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకోవడంలేదు. అసలు దువ్వాడకు వైసీపీకి సంబంధమే లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటు అంబేద్కర్ స్మృతివనం ఘటనపై టీడీపీ మాత్రం కౌంటర్లిస్తోంది. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు వైసీపీ రాద్ధాంతం చేస్తోందని, అక్కడ తొలగించింది జగన్ పేరు మాత్రమేనని అంటున్నారు టీడీపీకి చెందిన దళిత నేతలు. వైసీపీ నిరసనలకు కౌంటర్ గా వారు మీడియా ముందుకొచ్చారు. జగన్ పేరుని తొలగిస్తే, దాన్ని దళితులపై జరిగిన దాడి, అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడి, రాజ్యాంగంపై జరిగిన దాడి.. అంటూ అభివర్ణించడంలో లాజిక్ ఏంటని ప్రశ్నిస్తున్నారు.