10 యూట్యూబ్ ఛానళ్లకు ఏపీ పోలీసుల నోటీసులు
అవంతి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 10 యూట్యూబ్ ఛానళ్లకు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
వైసీపీ నేతలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారంపై ఏపీ పోలీసులు చర్యలు వేగవంతంగా చేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు చెందిన ఆడియోలు అంటూ పదేపదే ఇటీవల కొన్ని ఆడియో టేపులు బయటకు వస్తున్నాయి. మహిళల శృంగారభరిత సంభాషణలు సదురు ఆడియో టేపుల్లో ఉంటున్నాయి. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా అలాంటి ఆడియోనే ఒకటి బయటకు వచ్చింది. దానిపై అవంతి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అవంతి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 10 యూట్యూబ్ ఛానళ్లకు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టాప్ తెలుగు టీవీ, ఓపెన్ టాక్, ఆంధ్రా టీవీ, సీఎంటీవీ, టాప్ ట్రెండింగ్, తంబోల టీవీ, చట్టం తదితర ఛానళ్లకు నోటీసులు ఇచ్చారు. అసలు ఆ ఆడియో టేపు ఎవరి నుంచి, ఎలా వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. నోటీసులపై స్పందించిన రెండు ఛానళ్లు తమ తప్పును అంగీకరించి, ఆడియోను ఛానళ్ల నుంచి తొలగించాయని పోలీసులు తెలిపారు.