Telugu Global
Andhra Pradesh

వైసీపీ త‌ప్ప‌.. బాబు అవినీతిపై మాట్లాడే గొంతే లేదా..?

అవినీతి గురించి ఇంతగా మాట్లాడుతున్న పవన్, పురందేశ్వరి మరి చంద్రబాబు అవినీతి గురించి ఎందుకని మాట్లాడటంలేదు..? చంద్రబాబుకు ముడుపులు అందాయని ఆరోపణలు చేసింది వైసీపీ కాదు. స్వయంగా ఐటీ శాఖే..

వైసీపీ త‌ప్ప‌.. బాబు అవినీతిపై మాట్లాడే గొంతే లేదా..?
X

ఆంధ్ర‌ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి అధికార వైసీసీ నేతల టార్గెట్ అంతా చంద్రబాబునాయుడే అయ్యారు. చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. అందులో రూ. 118 కోట్ల ముడుపులు అందినట్లు ఆధారాలతో సహా ఐటీ శాఖ వివరించింది. దీని ఆధారంగానే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పదే పదే చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. సరే ప్రత్యర్థి పార్టీ కాబట్టి చంద్రబాబును వైసీపీ టార్గెట్ చేయటంలో ఆశ్చర్యం ఏమీలేదు. ఇక ఎల్లోమీడియా వ్యవహారం చూస్తే అందులో ఏ పేజీలో కూడా చిన్న వార్త కూడా ఇవ్వలేదు.

మొదటినుంచి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తోంది కాబట్టి ఎల్లోమీడియా వైఖరి గురించి ఎవరు పట్టించుకోవటంలేదు. మరి ప్రతిపక్షాలకు ఏమైంది..? బీజేపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ఎందుకు నోరెత్తటంలేదు..? అన్నదే అర్థం కావటంలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పదేపదే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

అవినీతి గురించి ఇంతగా మాట్లాడుతున్న పవన్, పురందేశ్వరి మరి చంద్రబాబు అవినీతి గురించి ఎందుకని మాట్లాడటంలేదు..? చంద్రబాబుకు ముడుపులు అందాయని ఆరోపణలు చేసింది వైసీపీ కాదు. స్వయంగా ఐటీ శాఖే చంద్రబాబు ముడుపులు అందుకున్నారని ఆధారాలతో సహా నోటీసులో చెప్పింది. అయినా పవన్, పురందేశ్వరి ఎందుకు మౌనంగా ఉన్నారు. చంద్రబాబు అవినీతి బయటపడటం వీళ్ళకి కూడా ఇబ్బందిగా ఉందా..? చంద్రబాబు ముడుపుల సంగతి ఐటీ శాఖ బయటపెట్టడం వీళ్ళకి నచ్చలేదా..?

ముడుపులు తీసుకున్న విషయం బయటపడింది కాబట్టి సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు మౌనంగా ఉన్నారంటే అర్థ‌ముంది. మరి ప్రశ్నించటానికే పార్టీ పెట్టిన పవన్, అవినీతి గురించి ప్రతిరోజు ఉపన్యాసాలు ఇచ్చే పురందేశ్వరి వైఖరే అర్థం కావటంలేదు. తమ వాడుకాబట్టి ఎంతటి అవినీతికి పాల్పడినా తాము మాట్లాడం అన్న సంకేతాలు వీళ్ళు జనాలకు పంపుతున్నట్లున్నారు. అందుకనే చంద్రబాబు అవినీతిపై వీళ్ళిద్దరూ నోరు మెదపటంలేదు. ఎంతకాలం ఇలా తమకు పట్టనట్లుగా వీళ్ళుంటారో చూడాల్సిందే.

*

First Published:  5 Sept 2023 12:02 PM IST
Next Story