చేతల ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు.. టీడీపీపై రోజా ఫైర్
ప్రభుత్వం, అధికారులు వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడంలో నిమగ్నమై ఉంటే టీడీపీ మాత్రం ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదంటూ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
తుపాను ప్రభావంతో ఏపీలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాలతో జనం ఇబ్బంది పడుతుంటే సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేసింది.
ప్రతిపక్ష విమర్శలపై మంత్రి రోజా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. ఒకవైపు ప్రభుత్వం, అధికారులు వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడంలో నిమగ్నమై ఉంటే టీడీపీ మాత్రం ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదంటూ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
'మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు దెప్పినందుకు ఏడ్చింది అన్నచందంగా ఉంది టీడీపీ నాయకుల పరిస్థితి. సీఎం జగన్ చేస్తున్న సహాయక చర్యలు చూసి ఓర్వలేక తెలుగుతమ్ముళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పచ్చమీడియాతో పిచ్చి కూతలు, పచ్చి రాతలు రాయించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. దమ్ముంటే వాళ్ళ హయాంలో చేసిన సహాయం గురించి మాట్లాడకుండా చేతల ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలే తగిన బుద్ది చెబుతారు' అని మంత్రి రోజా ట్వీట్ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించి చేస్తున్న సహాయ చర్యలకు సంబంధించిన వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు.
మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు దెప్పినందుకు ఏడ్చింది అన్నచందంగా ఉంది @JaiTDP నాయకుల పరిస్థితి. సీఎం @ysjagan చేస్తున్న సహాయక చర్యలు చూసి ఓర్వలేక తెలుగుతమ్ముళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పచ్చమీడియాతో పిచ్చి కూతలు, పచ్చి రాతలు రాయించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.… pic.twitter.com/OVk9mzIyiz
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 5, 2023