Telugu Global
Andhra Pradesh

ఏపీ మద్యాన్ని తమిళనాడు నిషేధించిందా..?

ఏపీ మద్యాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని, అక్కడ ఏపీ బ్రాండ్లు అమ్మడానికి లేదని, కనీసం వీటికి ఆ రాష్ట్రంలో ఎంట్రీ కూడా లేదని ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ఏపీ మద్యాన్ని తమిళనాడు నిషేధించిందా..?
X

ఏపీ మద్యం బ్రాండ్లపై ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది, జరుగుతోంది. ఏపీలో ఉన్న బ్రాండ్లు ప్రపంచంలో ఇంకెక్కడా లేవని, దొరకవని.. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్ పేరుతో ఏపీలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ప్రతిపక్షం గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏపీ మద్యాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని, అక్కడ ఏపీ బ్రాండ్లు అమ్మడానికి లేదని, కనీసం వీటికి ఆ రాష్ట్రంలో ఎంట్రీ కూడా లేదని ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ఏపీలో తయారయ్యే మద్యం బ్రాండ్లను తమిళనాడులో అమ్మకుండా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌ నిషేధిం విధించినట్టు సోషల్‌ మీడియాలో వస్తున్న వీడియో క్లిప్పింగ్‌ పూర్తిగా అవాస్తవమని ఏపీ డిస్టిలరీస్‌ అండ్‌ బ్రూవరీస్‌ కమిషనర్, APSBCL ఎండీ డి.వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యం బ్రాండ్లు తమిళనాడు సహా ఏ రాష్ట్రానికీ ఎగుమతి చేయడంలేదని స్పష్టం చేశారు.

ఏపీలో తయారయ్యే మద్యాన్ని కేవలం రాష్ట్రంలోనే వినియోగిస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో అమ్మకానికి ఎగుమతి చేయడంలేదని చెబుతున్నారు అధికారులు. తమిళనాడుకి మద్యం ఎగుమతులే జరగనప్పుడు ఆ రాష్ట్రంలో ఏపీ మద్యాన్ని నిషేధించే అవకాశమే ఉండదని లాజిక్ తీశారు. ప్రభుత్వంపై బురదజల్లాలనే ఉద్దేశంతోనే ఒక వీడియో క్లిప్ ని వాట్సాప్‌ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో తయారవుతున్న IMFL బీరు ఇక్కడే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీ, బ్రూవరీల మద్యం ఉత్పత్తిపై ప్రభుత్వ కెమికల్‌ లేబొరేటరీ ఇచ్చిన రిపోర్టులు పరిశీలించిన తర్వాతే వాటిలో IMFL ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. ఏపీలో తయారయ్యే మద్యంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు.

First Published:  26 March 2023 6:08 AM IST
Next Story