Telugu Global
Andhra Pradesh

ఏపీలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు.. కండిషన్స్ అప్లై

జర్నలిస్ట్ లకు ఇచ్చే ఇళ్ల స్థలాలు పూర్తి ఉచితం కాదు. స్థలం ఖర్చులో ప్రభుత్వం 60 శాతం మాత్రమే చెల్లిస్తుంది. మిగతా 40శాతం జర్నలిస్ట్ లు చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు.. కండిషన్స్ అప్లై
X

ఏపీలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు.. కండిషన్స్ అప్లై

ఏపీ లో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో కండిషన్లు కాస్త కఠినంగానే ఉన్నాయని అనిపిస్తోంది. తాజాగా దీనికి సంబధించిన ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేసింది. జర్నలిస్ట్ లకు ఇచ్చే ఇళ్ల స్థలాలు పూర్తి ఉచితం కాదు. స్థలం ఖర్చులో ప్రభుత్వం 60 శాతం మాత్రమే చెల్లిస్తుంది. మిగతా 40శాతం జర్నలిస్ట్ లు చెల్లించాల్సి ఉంటుంది.

షరతులు ఇవే..

- జర్నలిస్ట్ లకు కనీసం 5 సంవత్సరాల వృత్తి అనుభవం ఉండాలి.

- సదరు జర్నలిస్ట్ కానీ, వారి జీవిత భాగస్వామి కానీ గతంలో ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం తీసుకుని ఉండకూడదు. సొంత స్థలం ఉన్నా కూడా వారు ఈ పథకానికి అనర్హులు.

- ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.

- హౌస్ సైట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే జర్నలిస్టులు రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌ సైట్ అప్లికేషన్‌ ను తెరిచిన తేదీ నుంచి 45 రోజులలోపు ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ కి దరఖాస్తు చేయాలి. ఆ జాబితాను వారు జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు.

- జిల్లా కలెక్టర్లు ఇళ్ల స్థలాలకు సరిపోయే భూమిని గుర్తిస్తారు.

- భూమి గుర్తించిన తర్వాత దానిలో 60శాతం ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుంది. 40శాతం జర్నలిస్ట్ లు చెల్లించాల్సి ఉంటుంది.

- స్థలం కేటాయించిన తర్వాత పదేళ్లలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే కేటాయింపు రద్దవుతుంది.

- గరిష్టంగా 3 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తుంది.

జర్నలిస్ట్ లకు పూర్తి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వరని ప్రభుత్వ ప్రకటనతో తేలిపోయింది. హౌసింగ్ సొసైటీల పేరుతో 40శాతం లబ్ధిదారులే స్థలం ఖర్చు భరించాల్సి వస్తోంది. హౌసింగ్ సొసైటీల ఏర్పాటు అంటే అది ఓ పట్టాన తేలదు అనే అపవాదు కూడా ఉంది. అంటే ఈ ప్రభుత్వ హయాంలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

First Published:  11 Nov 2023 6:17 AM GMT
Next Story