Telugu Global
Andhra Pradesh

పెరిగిన మద్యం ఆదాయం.. జగన్ పై ఒత్తిడి పెరిగినట్టేనా..?

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో నూటికి 99 శాతం నెరవేర్చామనేది జగన్ ప్రభుత్వం చెప్పే మాట. అయితే మద్యపాన నిషేధం ఇంకా పంటికింద రాయిలా ఉంది. అది కూడా పూర్తయితే నూటికి నూరు మార్కులు పడతాయి.

పెరిగిన మద్యం ఆదాయం.. జగన్ పై ఒత్తిడి పెరిగినట్టేనా..?
X

పెరిగిన మద్యం ఆదాయం.. జగన్ పై ఒత్తిడి పెరిగినట్టేనా..?

ఏపీలో మద్యం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. అదే సమయంలో సీఎం జగన్ పై ఒత్తిడి కూడా పెరుగుతుందనే చెప్పుకోవాలి. నవరత్నాలన్నీ అమలు చేశామని చెప్పుకోడానికి వైసీపీకి ఉన్న ఏకైక అడ్డంకి సంపూర్ణ మద్యపాన నిషేధం. అధికారంలోకి రాగానే దశలవారీగా అని చెప్పుకొచ్చారు కానీ.. నాలుగేళ్లు దాటినా మద్యాన్ని నిషేధించే విషయంలో ప్రభుత్వం సాహసం చేయలేకపోతోంది. మద్యం అమ్మకాలు తగ్గించాం కదా అని ప్రభుత్వం కవర్ చేసుకుంటున్నా.. రేట్లు భారీగా పెంచి ఆదాయం పెంచుకున్న ప్రభుత్వం తమ చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోతోంది. ఎన్నికల నాటికి ఈ హామీని జగన్ ఎలా నిలబెట్టుకుంటారనేది ప్రశ్నార్థకం.

అమ్మఒడి.. నాన్న బుడ్డి..

అమ్మఒడి పేరుతో ప్రభుత్వం వేస్తున్న డబ్బులకు, నాన్న బుడ్డికి లెక్క సరిపోతోందంటూ ఇప్పటికే టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మద్యం ఆదాయం లేకపోతే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేవా అని నిలదీస్తున్నారు విపక్ష నేతలు. చీప్ బ్రాండ్స్ ని ఎక్కువ రేటుకి అంటగట్టి ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ దశలో అసలు మద్యపాన నిషేధం అనే హామీపై ఎన్నిల వేళ వైసీపీ ఏమని సమాధానం చెబుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

నూటికి నూరు శాతం అనిపించుకుంటారా..?

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో నూటికి 99 శాతం నెరవేర్చామనేది ప్రభుత్వం చెప్పే మాట. అయితే మద్యపాన నిషేధం ఇంకా పంటికింద రాయిలా ఉంది. అది కూడా పూర్తయితే నూటికి నూరు మార్కులు పడతాయి.కానీ ఆ ఒక్కటి చేస్తే, ఆదాయం తగ్గిపోయి మొదటికే మోసం వస్తుంది. అందుకే జగన్ ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన టైమ్ వచ్చింది. ఏడాదికేడాది ఆదాయం పెరుగుతూ పోతున్న ఈ టైమ్ లో మద్యానికి బ్రేక్ వేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. మద్యం అమ్మకాలు మరింత తగ్గిస్తామని చెప్పుకోవడం మినహా ఆ విషయంలో జగన్ కూడా చేయగలిగిందేమీ లేదు. ఆ ఒక్కటీ అడగొద్దు అంటూ ప్రజలకు నచ్చజెప్పి జగన్ ఎన్నికలకు వెళ్లాల్సిందే.

First Published:  18 July 2023 12:20 PM IST
Next Story