Telugu Global
Andhra Pradesh

చింతకాయల విజయ్‌కి చుక్కెదురు

సీఎం సతీమణిపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో సీఐడీకి సహకరించాల్సిందిగా ఆదేశించింది. చింతకాయల విజయ్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని కోర్టు స్పష్టం చేసింది.

చింతకాయల విజయ్‌కి చుక్కెదురు
X

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌తీమ‌ణి పేరుతో భారతి పే అంటూ ఫొటోల‌తో ప్ర‌చారం చేసిన కేసులో చింతకాయల విజయ్‌పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని నివాసానికి సీఐడీ పోలీసులు వెళ్లగా టీడీపీ ఎదురుదాడి చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న చింతకాయల విజయ్.. హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సాంకేతిక అంశాలను ఎత్తిచూపుతూ తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో తాను ఐ-టీడీపీకి ప్రెసిడెంట్‌గా ఉన్నట్టు పొందుపరిచారని.. కానీ అది అవాస్త‌వ‌మ‌ని వాదించారు. అసలు ట్విట్టర్ అకౌంట్‌కు ప్రెసిడెంట్‌ అన్న హోదానే ఉండదని సాంకేతిక అంశాలను ఎత్తిచూపారు. సీఐడీ పెట్టిన సెక్షన్లు కూడా తనకు వర్తించవని కోర్టుకెళ్లారు. అయితే చింతకాయల విజయ్ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు.

సీఎం సతీమణిపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో సీఐడీకి సహకరించాల్సిందిగా ఆదేశించింది. చింతకాయల విజయ్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని కోర్టు స్పష్టం చేసింది. తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న విజయ్ పిటిషన్‌ను కోర్టు తిర‌స్క‌రించింది.

First Published:  11 Oct 2022 7:34 PM IST
Next Story