హైకోర్టు జడ్జి బట్టు దేవానంద్ బదిలీ
హైకోర్టు జడ్జి బట్టు దేవానంద్ బదిలీ చేయొద్దని ఓ వర్గం న్యాయవాదులు, కొందరు కాంట్రాక్టర్లు ఏపీ హైకోర్టు ఆవరణలో కొన్ని రోజులు ఆందోళన చేశారు. అయినా బదిలీలు ఆగలేదు.
BY Telugu Global23 March 2023 3:20 PM IST

X
Telugu Global Updated On: 23 March 2023 3:20 PM IST
చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు కొలిక్కి వచ్చాయి. ఏపీ హైకోర్టు జడ్జి బట్టు దేవానంద్ తమిళనాడు రాష్ట్రం మద్రాస్ హైకోర్టు బదిలీ అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం వేయడంతో బదిలీలు ఖాయం అయ్యాయి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ దేవరాజు నాగార్జున్ కూడా మద్రాస్ హైకోర్టుకు బదిలీపై వెళ్లనున్నారు. జడ్జిల బదిలీ ఉత్తర్వులపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర పడటంతో జడ్జిలు తమకి బదిలీ అయిన స్థానాలకు వెళ్లక తప్పదు. హైకోర్టు జడ్జి బట్టు దేవానంద్ బదిలీ చేయొద్దని ఓ వర్గం న్యాయవాదులు, కొందరు కాంట్రాక్టర్లు ఏపీ హైకోర్టు ఆవరణలో కొన్ని రోజులు ఆందోళన చేశారు. అయినా బదిలీలు ఆగలేదు.
Next Story