నాగార్జునకు హైకోర్టు నోటీసులు
తాజాగా గురువారం ఈ పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బిగ్ బాస్ నిర్వాహకులు, హోస్ట్ అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇకపోతే బిగ్‌బాస్ రియాలిటీ షో యువతను తప్పుదోవ పట్టించడంతోపాటు అశ్లీలం, అనైతికం, హింసను ప్రోత్సహించేలా ఉందని సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారాలను నిలిపివేసేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. బిగ్ బాస్ రియాల్టీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాన్ని వీక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.సెన్సార్ లేకుండా ప్రసారం చేస్తున్నారనే పిటిషనర్ వాదన నేపథ్యంలో షో టెలికాస్ట్ వివరాలను ధర్మాసనం కోరింది.
ఈ సందర్భంగా కనీసం రెండు లేదా మూడు ఎపిసోడ్‌లను వీక్షిస్తామని తెలిపింది. అలాగే ఈ షో ప్రదర్శన వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు కోరిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది.
తాజాగా గురువారం ఈ పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బిగ్ బాస్ షో నిర్వాహకులు, హోస్ట్ అక్కినేని నాగార్జునలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని నోటీస్‌లో పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.