హైకోర్టులో బాబుకి షాక్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్
ఈ రోజు చంద్రబాబు మూడు కోర్టుల్లో ఆరు తీర్పుల కోసం వేచి చూస్తున్నారు. ముందుగా హైకోర్టు తీర్పులు వచ్చేశాయి. హైకోర్టు తీర్పుల్లో కనీసం ఒక్కటి కూడా బాబుకి పాజిటివ్ గా లేకపోవడం విశేషం.
బిగ్ మండే కాస్తా బాబుకి షాకిచ్చింది. ముందుగా హైకోర్టు తీర్పులు వెలువరించగా ఆ మూడూ చంద్రబాబుకి వ్యతిరేకంగా రావడం విశేషం. హైకోర్టులో ఉన్న మూడు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆయన వేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైంది. ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో బెయిల్ పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టివేసింది.
ఈ రోజు చంద్రబాబు మూడు కోర్టుల్లో ఆరు తీర్పుల కోసం వేచి చూస్తున్నారు. ముందుగా హైకోర్టు తీర్పులు వచ్చేశాయి. హైకోర్టు తీర్పుల్లో కనీసం ఒక్కటి కూడా బాబుకి పాజిటివ్ గా లేకపోవడం విశేషం. హైకోర్టులో ఉన్న మూడు బెయిల్ పిటిషన్లు కూడా డిస్మిస్ అయ్యాయి. అంటే ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో బాబు అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి.
మిగతా తీర్పులు కూడా ఈరోజే..
ఈ రోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. చంద్రబాబు అరెస్ట్ సక్రమమా, అక్రమమా అనేది సుప్రీంలో ఈరోజు తేలిపోతుంది. క్వాష్ పిటిషన్ లో అనుకూలంగా తీర్పు వస్తే చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. ఇక ఏపీలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజే తీర్పు రావాల్సి ఉంది. అటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై కూడా ఈ రోజు కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది. స్కిల్ స్కామ్ లో బాబుని మరోసారి సీఐడీ కస్టడీకి తీసుకోగలదా, లేక ఆయన బెయిల్ పై విడుదలవుతారా.. అనేది ఈ రోజు తేలిపోతుంది.
♦