జీవో నంబర్ 1 రద్దుపై చంద్రబాబు హర్షం.. అసలు ఏంటి ఈ జీవో పంచాయతీ అంటే?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్ షోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 1ని తీసుకొచ్చింది. కానీ ఆ జీవోని హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీనిపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు.
వైసీసీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని హైకోర్టు కొట్టివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్ షోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ జీవోని తీసుకొచ్చింది. కానీ ఆ జీవోని హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దాంతో చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లాంటి నాయకులు వస్తారని ఆనాడే ఊహించిన మేధావులు.. భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించేలా చట్టాలు రూపొందించారన్నారు.
జీవోని హైకోర్టు కొట్టివేయడంపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. ‘‘దేశంలో అంతిమంగా గెలిచేది... నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్ రాజ్యాంగమే. జగన్ లాంటి నాయకులు వస్తారని నాడే ఊహించి... భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారు. ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదని... అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి స్పష్టమైంది. ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై గొంతెత్తకుండా చేయాలనే దురుద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్1 ను హైకోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు.
దేశంలో అంతిమంగా గెలిచేది... నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్ రాజ్యాంగమే. జగన్ లాంటి నాయకులు వస్తారని నాడే ఊహించి...భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారు. ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదని....అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి… pic.twitter.com/PD184PNDjP
— N Chandrababu Naidu (@ncbn) May 12, 2023
జీవో నంబర్ 1పై ఏపీ లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్ అప్పట్లో వివరణ ఇచ్చారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదని.. అయితే నియమ నిబంధనలకు లోబడి సభలు, సమావేశాలు జరుపుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 1861 చట్టానికి లోబడే జీవో నంబర్ 1 తీసుకొచ్చినట్లు వివరించారు. జీవో ఆధారంగా షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆయా సభలకు పోలీసులు ప్రత్యామ్నాయ వేదికలు సూచిస్తారని, లేకపోతే సభల నిర్వాహకులే ప్రత్యామ్నాయాలు సూచించవచ్చని చెప్పారు. ఎక్కడా సభలను నిషేధిస్తామని జీవోలో చెప్పలేదని వివరించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు కూడా ఈ జీవో వర్తిస్తుందని తెలిపారు.