Telugu Global
Andhra Pradesh

లాయర్ల ఆందోళనతో సంబంధం లేదు- ఏపీ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్

ఈ నిరసన కార్యక్రమాలకు తమకు సంబంధం లేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రకటించింది. ఆ నిరసన కార్యక్రమాలు కొందరు న్యాయవాదులతో కూడిన సమూహం మాత్రమే చేసిందని అసోసియేషన్ అధ్యక్షుడు జానకీరామిరెడ్డి వెల్లడించారు.

లాయర్ల ఆందోళనతో సంబంధం లేదు- ఏపీ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్
X

ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేష్‌ల బదిలీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు న్యాయవాదులు రెండుగా చీలిపోయారు. టీడీపీ అనుకూల న్యాయవాదులు ఈ బదిలీలను వ్యతిరేకిస్తున్నారు. బదిలీలను నిరసిస్తూ కొందరు న్యాయవాదులు హైకోర్టు వద్ద ఆందోళన చేశారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ఒత్తిడి కారణంగానే న్యాయమూర్తుల బదిలీలు జరిగాయని ఒక సమూహానికి చెందిన న్యాయవాదులు ఆరోపించారు.

బదిలీ అయిన న్యాయమూర్తులే నిజాయితీపరులు అన్న అర్థం వచ్చేలా కొందరు న్యాయవాదులు మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమాలు హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలోనే జరిగాయంటూ టీడీపీ మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. అయితే ఈ నిరసన కార్యక్రమాలకు తమకు సంబంధం లేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రకటించింది. ఆ నిరసన కార్యక్రమాలు కొందరు న్యాయవాదులతో కూడిన సమూహం మాత్రమే చేసిందని అసోసియేషన్ అధ్యక్షుడు జానకీరామిరెడ్డి వెల్లడించారు.

జడ్జిల బదిలీలను వ్యతిరేకిస్తూ ఆ సమూహం చేసిన తీర్మానాలతో న్యాయవాదులు సంఘానికి ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు ప్రకటించారు. న్యాయమూర్తుల బదిలీ అన్నది సహజంగా జరిగేదేనని దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. బదిలీలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ నిందలేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

First Published:  26 Nov 2022 8:46 AM IST
Next Story