Telugu Global
Andhra Pradesh

ఏపీ టీచర్లకు రేపటి నుంచి కొత్త నిబంధనలు

ఇప్పటి వరకు హాజరు విషయంలో మూడు ఛాన్స్ లు ఇచ్చేవారు. 9 గంటలకు హాజరు వేయడం మూడుసార్లు మిస్ అయితే హాఫ్ డే సీఎల్ పెట్టుకోవాలని చెప్పేవారు. ఇప్పుడు ఆ నిబంధన గురించి ప్రస్తావించకుండా.. 9 గంటలు దాటితే హాజరు వేయొద్దు, సీఎల్ పెట్టుకోండి అని డీఈవోలు చెబుతున్నట్టు సమాచారం.

ఏపీ టీచర్లకు రేపటి నుంచి కొత్త నిబంధనలు
X

ఇప్పటికే ఉన్న నిబంధనలు, కానీ ఈ సోమవారం నుంచి అవి మరింత కఠినంగా అమలవుతాయి. ఆలస్యంగా అటెండెన్స్ వేయాల్సి వస్తే సెలవు పెట్టుకుని ఇంటికి వెళ్లాలంటూ డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు. అయితే వాట్సప్ ద్వారా ఈ ఆదేశాలు ఇవ్వడం విశేషం. సోమవారం నుంచిహాజరు విషయంలో కఠినంగా ఉంటామని తేల్చి చెబుతున్నారు అధికారులు. ఆలస్యమైతే ఆరోజు సెలవు పెట్టుకోవాలని అధికారులు తేల్చి చెప్పడంతో ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన మొదలైంది.

నిబంధన ఏంటి..?

ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ద్వారా ఈ ఇబ్బంది మొదలైంది. ఉదయం 9గంటలలోపు యాప్ ద్వారా హాజరు వేసుకోలేకపోతే హాఫ్ డే సీఎల్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. వాస్తవానికి ఉపాధ్యాయులంతా 9 గంటలకు ముందే పాఠశాలకు హాజరవుతారని అనుకున్నా.. యాప్ లో అటెండెన్స్ వేయడం ఓ ప్రహసనంలా మారుతోంది. సిగ్నల్ సమస్య ఉంటే హాజరు ఆలస్యమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో తరచూ సిగ్నల్స్ సమస్యలు వస్తున్నాయి, కొన్నిసార్లు పట్టణాల్లో కూడా హఠాత్తుగా సిగ్నల్ సమస్య వస్తుంది. అలాంటప్పుడు ఉపాధ్యాయుడు 9 గంటలకు ముందే పాఠశాలకు వచ్చినా హాజరు కోల్పోవాల్సిన పరిస్థితి.

గతంలో ఎలా..?

ఇప్పటి వరకు హాజరు విషయంలో మూడు ఛాన్స్ లు ఇచ్చేవారు. 9 గంటలకు హాజరు వేయడం మూడుసార్లు మిస్ అయితే హాఫ్ డే సీఎల్ పెట్టుకోవాలని చెప్పేవారు. ఇప్పుడు ఆ నిబంధన గురించి ప్రస్తావించకుండా.. 9 గంటలు దాటితే హాజరు వేయొద్దు, సీఎల్ పెట్టుకోండి అని డీఈవోలు చెబుతున్నట్టు సమాచారం. సీఎల్ పెట్టకపోతే షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరుతారని తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఈ ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. అటు డీఈవోలు కూడా ఉద్యోగులకు వాట్సప్ ద్వారా సమాచారం పంపించారు. సోమవారం నుంచే ఈ కఠిన నిబంధన అమలులోకి వస్తుంది. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలవరం మొదలైంది.

First Published:  6 Aug 2023 6:50 AM IST
Next Story