కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ల వయోపరిమితి పెంపు
వయోపరితిని పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ ఏడాది, రెండేళ్ల వ్యవధిలో అర్హత కోల్పోయిన కానిస్టేబుల్ ఉద్యోగార్థులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై సీఎం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపుపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో చాలా మంది ఈ ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు అవకాశం లభిస్తోంది. పలు పోలీసు ఉద్యోగాల భర్తీచేయాలన్న ఆదేశాల మేరకు వీటి భర్తీ కోసం పోలీస్‌శాఖ అక్టోబరు 20న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి (మరో 411 ఎస్పై పోస్టులు కూడా నోటిఫికేషన్‌లో ఉన్నాయి). వయోపరితిని పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ ఏడాది, రెండేళ్ల వ్యవధిలో అర్హత కోల్పోయిన కానిస్టేబుల్ ఉద్యోగార్థులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై సీఎం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవకాశం కల్పించేలా రెండేళ్ల పాటు వయోపరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.