Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు బెయిల్ క్యాన్సిల్ చేయండి.. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

ట్రయల్‌ కోర్టులో కేసు పెండింగ్‌ లో ఉండగా బెయిల్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. కేసు విచారణ కీలక దశలో ఉండగా హైకోర్టు జోక్యం సరికాదని, అయినా ట్రయల్‌ కోర్టులోని అంశాన్ని హైకోర్టు ఎలా నిర్ధారిస్తుందంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తోంది.

చంద్రబాబు బెయిల్ క్యాన్సిల్ చేయండి.. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
X

చంద్రబాబుకి ఏపీ హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరుతూ, హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తోంది. ఈ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో అనేక ప్రశ్నలను లేవనెత్తింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా హైకోర్టు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం చెప్పింది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని ఆరోపించింది. ట్రయల్‌ కోర్టులో కేసు పెండింగ్‌ లో ఉండగా బెయిల్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. కేసు విచారణ కీలక దశలో ఉండగా హైకోర్టు జోక్యం సరికాదని, అయినా ట్రయల్‌ కోర్టులోని అంశాన్ని హైకోర్టు ఎలా నిర్ధారిస్తుందంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తోంది.

లీవ్ పిటిషన్ లో ముఖ్యాంశాలు..

- సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది

- పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది

- హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది

- దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ నేతలు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు

- సీఐడీ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకు టీడీపీ ఇవ్వలేదు

- కేసుల మూలల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం న్యాయపరిధిని దాటడమే అవుతుంది

- బెయిల్‌ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్‌ ఎలాంటి వాదనలు చేయలేదు

చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడంతో టీడీపీ సంబరాల్లో మునిగిపోయి ఉంది. ముఖ్యంగా మధ్యంతర బెయిల్ లో ఉన్న నిబంధనలేవీ రెగ్యులర్ బెయిల్ లో లేవు. ఆయన సభలు, సమావేశాలకు హాజరు కావొచ్చని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఇప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న టీడీపీలో ఇక హుషారు వస్తుందని, చంద్రబాబు మీటింగ్ లతో వేడి పెరుగుతుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఈ దశలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం విశేషం. ఈ లీవ్ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  21 Nov 2023 10:26 AM IST
Next Story