ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో రిలాక్సేషన్
ఏసీబీ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం మారిన పరిస్థితుల నేపథ్యంలో పరిమితి పెంపు సబబుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ ప్రతిపాదనకు సాధారణ పరిపాలన శాఖ ఆమోదం తెలిపి జీవో ఇచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఉన్నప్పుడు వారి చేతిలో ఉంచుకోవాల్సిన డబ్బు విషయంలో ఉన్న పరిమితిని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఉన్నప్పుడు వారి చేతిలో ఉంచుకోదగిన డబ్బు మొత్తం పరిమితి రూ.500 వరకు ఉంది. అలాగే పర్యటనలో ఉన్నప్పుడు రూ.10 వేల వరకు చేతిలో ఉంచుకోవచ్చు.
ఇటీవల దీనిపై సమీక్షించిన ఏసీబీ ఉద్యోగులు చేతిలో ఉంచుకునే మొత్తాన్ని రూ.1000కి పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో డబ్బు చేతిలో ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదని అభిప్రాయపడింది. అయినా ఆ మొత్తాన్ని కొద్దిగా పెంచి రూ.1000కి పరిమితం చేయాలని సూచించింది.
ఏసీబీ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం మారిన పరిస్థితుల నేపథ్యంలో పరిమితి పెంపు సబబుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ ప్రతిపాదనకు సాధారణ పరిపాలన శాఖ ఆమోదం తెలిపి జీవో ఇచ్చింది.