Telugu Global
Andhra Pradesh

ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు.. చీఫ్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌

ఏపీలో చెలరేగిన అల్లర్లపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని వివరణ తీసుకుంది.

ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు.. చీఫ్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌
X

ఏపీలో పోలింగ్ తర్వాత చెలరేగిన హింసపై సిట్ ఏర్పాటైంది. మొత్తం 13 మంది సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ - SIT ఏర్పాటు చేశారు ఏపీ డీజీపీ. IPS అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ పని చేయనుంది. పోలింగ్ తర్వాత చెలరేగిన అల్లర్లపై కమిటీ విచారణ చేయనుంది.

సిట్‌ సభ్యులు వీళ్లే..

- ACB అడిషనల్ డీఎస్పీ సౌమ్యలత

- ACB డీఎస్పీ రమణ మూర్తి

- CID డీఎస్పీ పి.శ్రీనివాసులు

- ACB డీఎస్పీ వి.శ్రీనివాస రావు

- ACB డీఎస్పీ రవి మనోహర్

- సిట్ సభ్యులుగా ఇన్‌స్పెక్టర్లు భూషణం, కె. వెంకట్‌ రావు, రామకృష్ణ, మోయిన్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, శివ ప్రసాద్‌

ఏపీలో చెలరేగిన అల్లర్లపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని వివరణ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సిట్ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ. మరోవైపు పల్నాడు కలెక్టర్ సహా అనంతపురం, తిరుపతి జిల్లాలో పరిధిలోని పలువురు పోలీసు అధికారుపై ఈసీ ఇప్పటికే చర్యలు తీసుకుంది.

First Published:  17 May 2024 11:48 PM IST
Next Story