Telugu Global
Andhra Pradesh

మార్గదర్శికి బ్రేకులు.. రామోజీకి షాక్

చిట్ కంపెనీల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ-చిట్స్ అప్లికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చిట్ కంపెనీలన్నీ చందాదారుల వివరాలను, చిట్ మొత్తాలను, పాటలు పాడటంతో సహా అన్నీ వివరాలను ఇందులో నమోదు చేయాల్సిందే.

మార్గదర్శికి బ్రేకులు.. రామోజీకి షాక్
X

మార్గదర్శికి బ్రేకులు.. రామోజీకి షాక్

చిట్ ఫండ్ కంపెనీల్లోని చందాదారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త విధానాన్ని తెచ్చింది. మార్గదర్శితో పాటు మరికొన్ని చిట్ ఫండ్ కంపెనీల్లో జరిగిన, జరుగుతున్న మోసాలకు కళ్ళెం వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అప్లికేషన్‌ను రూపొందించింది. మోసాలకు చెక్ పెట్టడంలో భాగంగా ఆన్‌లైన్ విధానాన్ని పట్టుకొచ్చింది. చిట్ కంపెనీల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ-చిట్స్ అప్లికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చిట్ కంపెనీలన్నీ చందాదారుల వివరాలను, చిట్ మొత్తాలను, పాటలు పాడటంతో సహా అన్నీ వివరాలను ఇందులో నమోదు చేయాల్సిందే.

కొత్త విధానంలోనే చిట్లకు అనుమతులకు దరఖాస్తులు చేసుకుంటే, ఆన్‌లైన్లోనే రిజిస్ట్రార్ అనుమతులు మంజూరు చేస్తారు. చందాదారులకు తమ చిట్లకు సంబంధించిన ప్రతి విషయం తెలిసేలా పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహణ ఉండబోతోంది. కొత్త కంపెనీలే కాదు ఇప్పటికే ఉన్న చిట్ కంపెనీలన్నీ ఈ అప్లికేషన్లోకి మారాల్సిందే. చిట్ కంపెనీలన్నీ ప్రతి చందాదారుడికి లాగిన్, పాస్ వర్డ్ ఇవ్వాల్సిందే. తమ లాగిన్లోకి ఎంటరైన చందాదారుడు తమ ఖాతాలను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి అవకాశంలేదు. చందాదారుడికి ఏమైనా అనుమానాలుంటే చిట్‌ఫండ్ ఆఫీసుకు వెళ్ళి పాస్‌బుక్‌లో అప్‌డేట్ చేయమని అడగాల్సిందే. ఆన్‌లైన్‌లో అయితే ఎప్పటికప్పుడు తానే అప్‌డేట్ చూసుకోవచ్చు.

చందాదారులకు ఏమన్నా అనుమానాలుంటే వాటిని ఆన్‌లైన్‌లోనే తీర్చుకోవచ్చు, ఫిర్యాదులను కూడా ఆన్‌లైన్‌లో చేయచ్చు. ఇదే సమయంలో చిట్ ఫండ్ కంపెనీల వ్యవహారాలను, చిట్ పాటలు తదితరాలను చిట్స్ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఆన్‌లైన్‌లోనే అన్నీ వ్యవహారాలను పర్యవేక్షించే అవకాశాలున్నాయి.

చిట్‌ఫండ్ కంపెనీల మోసాలను నియంత్రించి చందాదారులకు రక్షణ కల్పించటమే ధ్యేయంగా ప్రభుత్వం చెప్పింది. చిట్ కంపెనీలన్నీ తమ లావాదేవీలను కచ్చితంగా ఈ ఆన్‌లైన్ విధానంలోనే ఇక నుండి చేయాల్సి ఉంటుంది. ఈ-చిట్స్‌ అప్లికేషన్‌ను అంగీకరించకపోయినా, ఫాలో కాకపోయినా వెంటనే వాటిపై యాక్షన్ తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎటూ ఉంటుంది. కాబట్టి మోసాలను మొదట్లోనే కంట్రోల్ చేయచ్చు. మరీ కొత్త విధానంపై మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.

First Published:  6 Nov 2023 10:41 AM IST
Next Story