Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి షాక్.. కరకట్ట గెస్ట్ హౌస్ కథ క్లోజ్

లింగమనేని గెస్ట్ హౌస్ ని ఏపీ ప్రభుత్వం అటాచ్ చేయడంతో చంద్రబాబుకి పెద్ద షాక్ తగిలినట్టయింది. కరకట్ట గెస్ట్ హౌస్ కథ కంచికి చేరినట్టయింది.

చంద్రబాబుకి షాక్.. కరకట్ట గెస్ట్ హౌస్ కథ క్లోజ్
X

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణానది కరకట్టపై ఉన్న ప్రజా వేదికను కూల్చి వేసింది. అప్పట్లో చంద్రబాబుపై ప్రతీకారం కోసమే ఈ కూల్చివేత అంటూ టీడీపీ రాద్ధాంతం చేసింది. ఆ తర్వాత లింగమనేని గెస్ట్ హౌస్ విషయంలో కూడా అంతే రాద్ధాంతం జరిగింది. లింగమనేని అనే వ్యాపారి కట్టుకున్న గెస్ట్ హౌస్ ని చంద్రబాబుకి ఎందుకు అప్పనంగా అప్పగించారనేదే అసలు పాయింట్. దానిపై విచారణ జరిగి, ఆ లావాదేవీ అక్రమం అని తేల్చింది సీఐడీ. తాజాగా లింగమనేని గెస్ట్ హౌస్ ని ఏపీ ప్రభుత్వం అటాచ్ చేయడంతో చంద్రబాబుకి పెద్ద షాక్ తగిలినట్టయింది. కరకట్ట గెస్ట్ హౌస్ కథ కంచికి చేరినట్టయింది.

కృష్ణానది కరకట్టపై లింగమనేని రమేష్ బాబు అనే వ్యాపారి ఓ గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు రమేష్ బాబుకి అనుకూలంగా అమరావతిలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, సీఆర్డీఏ మాస్టర్‌ ప్లాన్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌ మెంట్లలో అవకతవకలకు పాల్పడి రమేష్ బాబుకి లబ్ధి చేకూర్చారని, ప్రతిఫలంగా చంద్రబాబు ఆ గెస్ట్ హౌస్ తీసుకున్నారనేది వైసీపీ ఆరోపణ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కరకట్ట గెస్ట్ హౌస్ వ్యవహారం తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం సీఐడీతో ఎంక్వయిరీ మొదలు పెట్టింది. సీఐడీ విచారణలో క్విడ్ ప్రోకో జరిగినట్టు గుర్తించింది. దీంతో ప్రభుత్వం తాజాగా ఆ గెస్ట్ హౌస్ ని అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ చేయడంతో చంద్రబాబుకి భారీ షాక్‌ తగిలినట్టయింది. ఓవైపు అమరావతి వ్యవహారాలపై వేసిన సిట్ విచారణకు అడ్డంకుల్లేకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. మరోవైపు లింగమనేని గెస్ట్ హౌస్ విషయంలో గోల్ మాల్ జరిగిందని, క్విడ్ ప్రోకో ప్రకారమే ఆ గెస్ట్ హౌస్ చంద్రబాబుకి దక్కిందని సీఐడీ తేల్చింది. అక్కడితో ఆగకుండా ఆ గెస్ట్ హౌస్ ని అటాచ్ చేసింది ప్రభుత్వం. సీఎంగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది ప్రభుత్వం.

First Published:  14 May 2023 1:49 PM IST
Next Story